సంకర జాతి అవులకు తైలేరిసిస్ టీకాలు

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని కొత్తపల్లి గ్రామల్లో సంకర జాతి ఆవులకు తైలెరిసిస్ టీకాలను వైద్యులు కిరణ్ డేష్ పాండే మంగళవారం వేశారు. 35 సంకర జాతి ఆవులకు టీకాలు వేశారు. ప్రతి రైతు సంకర జాతి ఆవులకు తప్పని సరి టీకాలు వేయించాలి వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఉమమ సహేర్ వస్, వి ఎల్ ఓ వినిత, జేవిఓ గంగజమున, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.