ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది…

– బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి….
నవతెలంగాణ- రెంజల్
తెలంగాణలో మార్పు కోరుకున్న ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం రెంజల్ మండలంలోని వీరన్న గుట్ట, రెంజల్, సాటాపూర్, బోర్గం, తాడు బిలోని, దండిగుట్ట, దూపల్లి గ్రామాలలో పర్యటించి ఆయా గ్రామాల సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. మండల కేంద్రం లోని రెంజల్ బందల్లా, మాచాపూర్ రోడ్లపై ప్రత్యేక దృష్టి స్తానని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలలలో గదుల కొరత, మౌలిక సదుపాయాల ఏర్పాటు, తాగునీటి ఎద్దడి, వృద్ధులకు పింఛన్లు, తాగునీరు సాగునీరు పై ప్రత్యేక దృష్టిని సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రైతు చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీలకతీతంగా నిరుపేదల సమస్యలపై ప్రత్యేక దృష్టిని సాధించాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అప్పటి ప్రభుత్వం నెరవేర్చలేక పోయిందని, వాటిపై తమ ప్రభుత్వం దృష్టి సారించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో ఆయా శాఖల అధికారులను పిలిపించి నిలిచిపోయిన పనుల గురించి వివరణ అడిగారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, మాజీ జెడ్పిటిసి నాగభూషణ్ రెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి జావిద్, మాజీ సింగిల్ విండో చైర్మన్లు సాయి రెడ్డి, సిహెచ్ రాములు, సాయిబాబా గౌడ్, ఎంఎల్ రాజు, గొజ్జ బూమన్న, గియాసుద్దీన్, షౌకత్, బన్షియ నాయక్, కార్ఖానా శ్రీనివాస్, పాస్టర్ శ్రీనివాస్, సురేష్, లచే వార్ నితిన్, యువజన నాయకులు కార్తీక్ సిద్ధ సాయిలు, సల్మాన్, కృష్ణ గైన కిరణ్ రాకేష్, శంషాద్దీన్, తదితరులు పాల్గొన్నారు.