అప్పుడు ఈ రోజుల్లో.. ఇప్పుడు బేబీ

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రధారులుగా నటించిన మూవీ ‘బేబీ’. ‘కలర్‌ ఫోటో’ని నిర్మాత సాయి రాజేష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 14న విడుదల కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్‌ను శుక్రవారం రిలీజ్‌ చేశారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ”బేబీ’ తరువాత సాయి రాజేష్‌ ఎక్కువగా సెలబ్రేట్‌ చేసు కుంటారు. ఈనెల14న టీం అంతా కూడా పండుగ చేసుకునేలా ఉంటుంది’ అని అన్నారు. ‘బన్నీ వాసు కథ విని బాగుందని అన్నారు. సినిమా చూసి చాలా బాగా తీశారన్నారు. విజరు బుల్గానిన్‌ ప్రాణం పెట్టి పాటలు ఇచ్చాడు. డీఓపీ బాల్‌ రెడ్డి అద్భుతమైన విజువల్స్‌ అందించాడు’ అని నిర్మాత ఎస్‌.కే.ఎన్‌ చెప్పారు. బన్నీ వాసు మాట్లాడుతూ, ‘వారం క్రితమే సినిమాను చూశాను. ‘7/జీ బందావన కాలనీ’ ఎలాంటి ఫీల్‌ను ఇచ్చిందో ఇప్పుడు ఈ తరానికి ఆ ఫీల్‌ను ఇస్తుంది. ఆనాడు ‘ఈరోజుల్లో’ కల్ట్‌, ఇప్పుడు ‘బేబీ’ కల్ట్‌ అవుతుంది. ఈ సినిమా ఒక కల్ట్‌ ట్రెండ్‌ అవుతుంది’ అని తెలిపారు.
దర్శకుడు మారుతి మాట్లా డుతూ, ‘మూడు పాత్రలతో ఇంత మంచి సినిమాను తీయడం, మనల్ని నవ్వించడం, ఏడ్పించడం కేవలం దర్శకుడు సాయి రాజేష్‌ వల్లే సాధ్యం’ అని అన్నారు. ‘కచ్చితంగా ఓ మంచి సినిమా తీశాను. సినిమా తీయక ముందు నన్ను నమ్మింది మాత్రం నా ఫ్రెండ్‌ ఎస్‌కేఎన్‌. ఈ సినిమా నిర్మాతకు గౌరవాన్ని తీసు కొస్తుందని చెప్పగలను’ అని డైరెక్టర్‌ సాయి రాజేష్‌ అన్నారు.
హీరో ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ,’సినిమా చూసిన తరువాత అందరినీ ఓ వారం పాటు వెంటాడుతూ ఉంటుంది. ఇందులోని మాటలు, పాటలు మిమ్మల్ని హాంట్‌ చేస్తాయి’ అని చెప్పారు. మరో హీరో విరాజ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. ఇందులోని ప్రతీ కారెక్టర్‌కు అందరూ కనెక్ట్‌ అవుతారు’ అని తెలిపారు.
నాయిక వైష్ణవీ చైతన్య మాట్లాడుతూ, ‘ఇన్ని ప్రేమ కథలు వచ్చాయి కదా? మేం ఈ సినిమా ఎందుకు చూడాలని అడగొచ్చు.. ఈ సినిమాలో రియాల్టీని చూపించాం. అందరి లైఫ్‌లో జరిగేది చూపించాం’ అని చెప్పారు.