బరిలో 2,898 మంది అభ్యర్థులు…

2898 candidates in Bari...– 119 నియోజకవర్గాలకు 4,798 నామినేషన్లు
– గజ్వేల్‌లో 114.. కామారెడ్డి బరిలో 58 మంది అభ్యర్థులు
– 608 నామినేషన్లు తిరస్కరణ
– నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు
హైదరాబాద్‌: నామినేషన్ల పరిశీలన అనంతరం శాసనసభ ఎన్నికల బరిలో 2,898 మంది అభ్య ర్థులు మిగిలారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4,798 నామినేషన్లు వేశారు. సోమవారం జరిగిన స్క్రూటినీలో వాటిలో 608 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. పరిశీలన అనంతరం మిగిలిన 2,898 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
అత్యధికంగా గజ్వేల్‌లో 114 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మేడ్చల్‌లో 67, కామారెడ్డిలో 58 మంది, ఎల్బీనగర్‌లో 50 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
కొడంగల్‌లో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అత్యల్పంగా నారాయణపేటలో కేవలం ఏడుగురు అభ్యర్థులు, బాల్కొండ బరిలో తొమ్మిది మంది ఎన్నికల బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం వరకు గడువు ఉంది.