లేబర్ కార్డు ప్రయోజనాలు అందక అర్హులు ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ నాయకులు కడారి రాములు అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని ఏఐటీయూసీ భవన్ సుభాష్ నగర్ లోని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల లేబర్ కార్డుల ఆన్లైన్ లో రెండు నెలలుగా సైట్ ఓపెన్ కాకపోవడంతో నూతన లేబర్ కార్డులు, కార్మికులకు అందే బెనిఫిట్స్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. పెండింగ్ ఫైల్స్ క్లియర్ కాక ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. వెంటనే ఆన్లైన్ ప్రారంభించి, భవన నిర్మాణ కార్మికులకు థంబ్ సిస్టం రద్దు చేయాలని, నూతన లేబర్ కార్డులు అందించాలని,55 సంవత్సరాల కార్మికులకు 5 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలనికోరారు. వేములవాడ, సిరిసిల్ల ప్రాణతంలో ఇసుక లేక, మొరం లేక కార్మికులకు పనిదొరకాక ఇబ్బంది పడుతున్నారని ప్రతిరోజు ఇసుక పెర్మిషన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కేంద్రములో ఉన్న బీజేపి ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను ఎత్తివేసి 4 లేబర్ కోడ్ లుగా కుదించి 1996 లో సాధించుకున్న లేబర్ కార్డుల జీవో, ఎల్ఐసిలాంటి ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టి కార్మికుల యొక్క పొట్టలు కొట్టే విధానం వెనక్కు తీసుకోవాలని అన్నారు.ప్రభుత్వ రంగంలోనే లేబర్ కార్డుల వ్యవస్థ ఉండేలా చూడాలని,ఈస్రం లాంటి కొత్త కొత్త కార్డుల పేరుతో కార్మికులను గందరగోళానికి గురి చేయవద్దని,కార్మిక సంక్షేమంలో సెస్ డబ్బులు ఇంటి పర్మిషన్లో 2% కార్మికులకు మాత్రమే ఉపయోగ పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.సోమవారంలోపు పరిస్కారం లభించని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాపనాటి రవి, శీలం నర్సయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.