ప్రజా సేవకు అనేక మార్గాలు ఉన్నాయి

There are many paths to public serviceఎస్ఆర్ఆర్ సంస్థ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణరాయపర్తి
ప్రజాసేవ చేయడానికి రాజకీయమే మార్గం కాదని ఇంకా అనేక మార్గాలు ఉన్నాయని ఎస్ఆర్ఆర్ సంస్థల అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని కొండూరు, కాట్రపల్లి గ్రామాల్లో నిర్వహించనున్న దుర్గామాత ఉత్సవాలకు 21 వేయి రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సౌజన్యకు ఆరు వేల రూపాయలు అందచేసి భరోసా కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన దసరాను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న దుర్గామాతలను భక్తిశ్రద్ధలతో పూజించి నవరాత్రులను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. వర్తమాన కాలంలో ఫౌండేషన్ కార్యకలాపాలు విస్తృతమైన వేళ సామాజిక మాధ్యమాల్లో గందరగోళ మెసేజ్ లు ప్రచారం కావడం బాధాకరం అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయని రాజకీయాల ద్వారా మరింత సేవ చేయగలుగుతానని భావించినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. మండల ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుపి హెచ్ఐ వల్లాల సుధాకర్, పతంగి వేణు, కేశవరెడ్డి, కాట్రపల్లి విక్టరీ యూత్ అధ్యక్షుడు గిర్క సురేష్, బిక్షపతి, మధు అశోక్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.