– గ్రామసభ దే నిర్ణయాధికారం…
– ప్రజామోదం తోనే లబ్ధిదారుల ఎంపిక…
– అర్హులైన ప్రతిఒక్కరికీ లబ్ధి… – ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ ప్రభుత్వం లో రహస్యానికి తావే లేదని,ఏ పధకం అమలు చేయాలన్నా గ్రామ సభకే సర్వాధికారాలు ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. మండలం లోని మొద్దులమడ, కోయ రంగాపురం గ్రామ పంచాయతీలకు గిరిజన సంక్షేమ శాఖ నిధులు తో,రూ 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాలను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శులను సన్మానించారు. మొద్దులమడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 వ తేదీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే నాలుగు పథకాలు గురించి వారికి వివరించారు. విద్యా వైద్యం ప్రజారోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని,ఎవరి ఎటువంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ,తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్, మండల ప్రత్యేక అధికారి,పశు సంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్,ఐటీడీఏ ఏఈ బీఎస్వీ ప్రసాద్,ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,ఎంపీఈవో సోయం ప్రసాద్,కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు,నాయకులు జూపల్లి రమేష్,ఏసు బాబు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.