– ఆయిల్ ఫాం టన్ను గెలల ధర రూ.13,828..
– జూన్ నెల కంటే జులై లో రూ.123 లు పెరుగుదల..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఒక పక్క గెలలు దిగుబడి తగ్గి పోయినా ధరలు అయినా పెరుగుతాయి నే ఆశలో రైతులు ఉంటే జులై నెలలో గెలలు ధర పెరగకపోవడంతో ఆయిల్ ఫాం రైతులు సతమతం అవుతున్నారు. జులై నెలకు చెల్లించాల్సిన ఆయిల్ ఫాం గెలలు ధరను ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులు ఈ నెల. మొదటివారంలో ప్రకటించారు.ప్రతీ నెల 1 వ తేదీనే బహిర్గతం చేసే అధికారులు గత రెండు నెలలుగా ధరను ప్రకటించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.కారణం ఏదైనప్పటికీ జులై నెలకు చెల్లించాల్సిన టన్ను గెలలు ధర రూ.13,828 లు గా ఆయిల్ ఫెడ్ అధికారులు నిర్ణయించారు.అయితే జూన్ నెల కంటే జులై నెలలో టన్నుకు రూ.123 లతో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపిస్తుంది. ఈ ఏడాది గడిచిన 6 నెలల్లో టన్ను గెలలు కు జనవరిలో రూ.12,681 లు, ఫిబ్రవరిలో రూ.13,135 లు, మేలో రూ.13,438 జూన్ లో రూ. 13,705,జులై లో రూ.13,828 లు మాత్రమే.మార్చి లో రూ. 14,174 లు, ఏప్రిల్లో రూ.14,229 లు గా ధరలు ఉన్నాయి. 2021 ఏప్రియల్ టన్ను గెలలు ధర 15,147 లు నుండి పెరుగుతూ 2022 జూన్ రికార్డ్ స్థాయిలో రూ.23,467 చేరుకుని రైతులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసాయి. అక్కడ నుండి అదే ఏడాది సెప్టెంబర్ వరకు రూ.16 పై చిలుకు వరకు ఉంది.ధరలు తగ్గడం మొదలైన మొదలవడం నేటికీ పెరగని పరిస్థితి ఉంది. దీనికి తోడు గెలలు దిగుబడులు సైతం భారీగా పడిపోయాయి.వాస్తవానికి జులై నుండి అక్టోబర్ వరకు అధికంగా గెలలు దిగబడి కాలంగా (పీక్ సీజన్)ఆయిల్ ఫెడ్ పరిగణిస్తుంది.కానీ ఈ గీతం నాలుగేళ్ళ జులై నెలలు కంటే కూడా ఈ గడిచిన జులై లో గెలలు దిగబడి పడిపోయింది.దీంతో గెలలు రాక,ధరలు లేక ఆయిల్ ఫాం సాగు దారులు ఆందోళన వ్యక్తం చెస్తున్నారు.
నెల ధర హెచ్చుతగ్గులు
జనవరి 12,681
ఫిబ్రవరి 13,135 + 454
మార్చి. 14,174 + 1,039
ఏప్రియల్. 14,229 – 55
మే 13,438 – 791
జూన్ 13,705 + 261
జులై 13,828 + 123
వాతావరణంలో వచ్చిన మార్పులకు ఈ ఏడాది గెలల దిగుబడి సైతం తగ్గుముఖం పట్టింది.దీనికి తోడుగా గెలల ధర సైతం అంతంత మాత్రమే ఉండటంతో రైతులు నిరాశకు గురి అవుతున్నారు.పీక్ సీజన్ ప్రారంభం నెల అయిన జులై లో ఏ సంవత్సరం ఎన్ని టన్నుల గెలలు దిగుబడి అయ్యాయో చూద్దాం.
సంవత్సరం జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్
2020 – 21 36000 34000 37000 27000
2021 – 22 30000 34000 21000 37000
2022 – 23 30000 30000 36000 33000
2023 – 24 22000 ——– ——- ——