కాంగ్రెస్ లో భగ్గుమంటున్న వర్గ పోరు

నవతెలంగాణ – రామారెడ్డి
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ లో వర్గ పోరు  బగ్గు మంటుంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గల రామారెడ్డి మండలం రెండు నియోజకవర్గాల్లో ఉండటంతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మధ్య గతం నుండే పచ్చ గడ్డి వేస్తే బాగుంటుంది. రామారెడ్డి మండల పార్టీ అధ్యక్షునిగా శీల సాగర్ ను నియమించడంతో బగ్గుమన్న వర్గ పోరు, మండల యూత్ ప్రెసిడెంట్ రామారెడ్డి గ్రామానికి చెందిన వడ్ల మురళి ని నియమించడంతో మరోసారి సోషల్ మీడియాలో కార్యకర్తల వాయిస్ కాల్స్ హల్ చల్ అయ్యాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడి జెండాలు మోసిన నాయకులకు, కార్యకర్తలతో చర్చించకుండానే, కొత్త వ్యక్తులకు మండల పార్టీ పదవులు కట్టు పెడుతున్నారని రెండు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయి ఆరోపణలు చేసుకోవడం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వద్దకు వెళ్లగా నేనే రాజు, నేనే మంత్రిని అనే విధంగా వ్యవహరిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చర్చ కొనసాగుతుంది. రామారెడ్డి మండల లో ఆదివారం సోషల్ మీడియాలో చర్చ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోసానిపేట గ్రామానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకులు, రామారెడ్డి గ్రామానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుని పై ఫిర్యాదు చేయడంపై వర్గ పోరు భగ్గుమన్నది. కాంగ్రెస్ అధిష్టానం వెంటనే స్పందించి నాయకులు, కార్యకర్తల మధ్య చర్చించి కష్టపడిన వారికి పదవులు అందేలా చర్యలు తీసుకోవాలని, అందరూ ఒక తాటిపై నిలబడి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.