
– అధికారంలోకి రాగానే 400 కే సిలిండర్ పొందండి,
– ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే హనుమంతు షిండే
నవతెలంగాణ- మద్నూర్:
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, పార్టీలకు జుక్కల్ నియోజకవర్గంలో నిలబెట్టడానికి అభ్యర్థులు కరువయ్యారని ఇతర జిల్లాల వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయడం స్థానికేతురులు ఎన్నికల మట్టుకే సుగ్గి కోసం వచ్చే వారి పట్ల నమ్మకండి స్థానికుడినైనా నన్ను నమ్మండి ఈసారి ఎన్నికల్లో ఆశీర్వదించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనని గెలిపించండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే ఎన్నికల ప్రచారంలో ప్రజలకు తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా డోంగ్లి మండలంలో రెండవ రోజు శుక్రవారం నాడు ఈలేగావ్ మాదన్ ఇప్పర్గా లింబూర్ చిన్న టాక్లి పెద్ద టాక్లి సిర్పూర్ గ్రామాల్లో ఎన్నికల ముమ్మర ప్రచారాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రచారాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కెసిఆర్ ఇచ్చిన మాట తప్పడని ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 400 రూపాయలకే సిలిండర్ అందించడం జరుగుతుందని పెన్షన్ల పెంపు రైతుబంధు పెంపు దళిత బంధు ప్రతి ఒక్కరికి అందించడం అర్హులైన మహిళలకు 3000 రూపాయలు ఇవ్వడం తెల్ల రేషన్ కార్డు కుటుంబాల అందరికీ ఆరోగ్య భీమా కల్పించడం ఇలాంటి అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కేసీఆర్ కె సాధ్యమని ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలు ఇచ్చే హామీలు నమ్మవద్దని తెలిపారు ప్రజా సంక్షేమం కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు ఈ ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ వాగుమారే లక్ష్మీబాయి ఈలేగావ్ గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాంద్ పటేల్ మాదన్ ఇప్పర్గా సర్పంచ్ రాజ్ కుమార్ లింబూర్ గ్రామ సర్పంచ్ మధుకర్ పటేల్ చిన్న టాక్లి గ్రామ సర్పంచ్ గీత లాలు పెద్ద టాక్లి గ్రామ సర్పంచ్ రాజాబాయి విలాస్ సిర్పూర్ గ్రామ సర్పంచ్ కవిత శంకర్ పటేల్ డోంగ్లి సింగిల్విండో చైర్మన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రామ్ పటేల్ డోంగ్లి సింగిల్ విండో వైస్ చైర్మన్ విజయ్ పటేల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శశాంక్ పాటిల్ డోంగ్లి గ్రామ సర్పంచ్ మాధవి మద్నూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ ఇరు మండలాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు