బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే యువతకు బంగారు భవిష్యత్‌

– ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి
– అభివద్ధి, సంక్షేమానికి పెద్ద పీఠ
– ఇబ్రహీంపట్నం అంబేద్కర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ యువ సమ్మేళనం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే యువతకు బంగారు భవిష్యత్‌ లభించిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివద్ధి, సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తుందని చెప్పారు. రాష్ట్ర అభివద్ధి, యువత బంగారు భవిష్యత్‌ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌ విజన్‌ తో ముందుకు వెళ్ళుతున్నారని అన్నారు. బుధవారం రాత్రి ఇబ్రహీంపట్నం అంబేద్కర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ యువ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుంచి ఇప్పటి వరకూ 18 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్‌, కేటీఆర్‌కే దక్కిందన్నారు. నియోజకవర్గంలోని యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి (ఎంకేఆర్‌) ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ ఇప్పించడంతో 11 వందల మంది యువతీ, యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారన్నారు. నియోజకవర్గంలో గత 14ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున అభివద్ధి పనులు చేయడం జరిగిందని చెప్పారు. కొంగరకలాన్‌ లో ఫాక్స్‌ కాన్‌ కంపెనీ పనులు పూర్తియితే నియోజకవర్గంలో 20వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ఇబ్రహీంపట్నం నియోజవర్గాన్ని దశ దిశల అభివద్ధి పనులు చేస్తున్నామన్నారు. మరో సారి కెసీఆర్‌ ను ఆశీర్వదించాలని కోరారు. అత్యధిక యువత కలిగిన బీ ఆర్‌ ఎస్‌ ను ఢకొీనే శక్తి ఏ పార్టీకి లేదన్నారు. రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్‌ మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం శాంతి భద్రతలు, సంక్షేమ, అభివద్ధిలో దేశంలోనే నంబర్‌ వన్‌ గా నిలుస్తుందని చెప్పారు. యువజన విభాగం రాష్ట్ర నాయకులు మంచి రెడ్డి ప్రశాంత్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. తాను నియోజకవర్గంలో మూడు నెలల పాటు ప్రగతి నివేధన పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకుని ఎమ్మెల్యే ద్వారా పరిష్కరించడం జరిగిందన్నారు. బహిరంగ సభకు ముందు తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్‌ కు ఘన నివాళి అర్పించారు. యువ సమ్మేళనానికి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువత హజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాయల చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్‌ ఛైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య, మార్కెట్‌ కమిటి చైర్మన్‌ చంద్రయ్య, ఎంపీపీ కపేష్‌, యాచారం జడ్పిటీసీ జంగమ్మ, మున్సిపాల్‌ వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి, మాజీ జడ్పీటీసీ కర్నాటి రమేష్‌, యువజన విభాగం నియోజవర్గ అధ్యక్షులు జర్కొని రాజు, మండల భారాస అధ్యక్షుడు బుగ్గరాములు పాల్గొన్నారు.