– ఎవ్వరికీ వారే దిమా వ్యక్తం..
నవతెలంగాణ – మాక్లూర్
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్మూర్ నియోజక వర్గంలో నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార పార్టీ బిఅర్ఎస్ అభ్యర్థిగా ఆశాన్న గారి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పొద్దుటురి వినయ్ కుమార్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా పైడి రాకేష్ రెడ్డి, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా గాండికోట రాజన్న బరిలో ఉన్నారు. వీరిలో బిఅర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు పోటపోటిగా త్రికోణ పోటీలో ఉన్నారు. వీరు నువ్వా నేనా అనాట్టు ప్రచారం చేశారు. ఒక్కరిపై ఒక్కరూ విమర్శలు చేసుకుంటూ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ ముందుకు సాగారు.
అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్ష పార్టీల పోటీ..
అధికార పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి దీటుగా ప్రతి పక్ష పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దీటుగానే పోటీ పడ్డారు. తమ నాయకులతో ఎప్పటికీ అప్పుడు చర్చలు జరుపుకుంటూ ముందుకు వెళ్ళారు. గత తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి గట్టి పోటీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి, బిజెపి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఇస్తున్నారు. వినయ్ కుమార్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా గ్రామాల్లో స్వచ్ఛందంగా పేదలకు సేవ చేయడంతో గ్రామాల్లో ఆయనకు మంచి పలోవర్స్ ఉన్నారు. దానికి తోడుగా గతంలో బిజెపిలో ఉండి 2018 సంవత్సరంలో పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి టికెట్ ఆశించిన ఆయనను పక్కకు నెట్టడంతో, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. ఆయనతో పాటు కొంత మంది బిజెపి నాయకులు, ఆయన ద్వారా లబ్దిపొందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి తోడు కాంగ్రెస్ పాత క్యాడర్ ఉండటంతో ఆయనకు మంచి సపోర్ట్ దొరికింది. బిఆర్ఎస్ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారనీ అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. దానికి తోడు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు కాంగ్రెస్ లోకి చేరడంతో ఆయన ఆర్మూర్ నియోజక వర్గంలో ప్రభావం చుపగల్గుతున్నరు. ఒక్కసారి ఓటమి చవి చూడటంతో ప్రజల్లో సానుభూతి ఉంది. గెలుపే లక్ష్యంగా వినయ్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. బిజెపి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి వ్యాపార వేత్త. ఎన్నికలకు నాలుగు నెలల ముందు రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చి రాగానే బిజెపి టికెట్ పొంది పోటీలో ఉన్నారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు సహకారంతో గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. బిఆర్ఎస్ అసమ్మతి వాదులు కొంత మంది బిజెపిలో చేరడంతో బలం చేకూరింది. అతి కొద్ది కాలంలోనే ఆయన ప్రచారంలో పుంజుకున్నారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి గండికోట రాజన్న ప్రచారాలకు దూరంగానే ఉన్నారు. అపుడప్పుడు ఆటో ను గ్రామాల్లో తిపుతున్నరు. బిఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గ్రామాల్లో కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు పేరుతో ముందుగా వెళుతూ, అధికార పార్టీ పథకాలను ప్రజలకు వివరిస్తూ సాగారు. గెలుపుపై ఎవ్వావ్వరికి వారే ధీమా వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో ముందుకు వెళ్ళారు. ప్రధాన పార్టీలైన బిఅర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. వీరిలో ఎవ్వరూ గెలుపొందుతారో వేచి చూడాల్సిందే.