చేపలకు భలే గిరాకీ

– అదును చూసి ధర పెంచిన వ్యాపారులు
నవతెలంగాణ-కల్లూరు
మృగశిర కార్తె రోజున చాపలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్రజల్లో నమ్మకం. శనివారం మృగశిర కార్తె కావడంతో కల్లూరు చాపల మార్కెట్లో జనం పోటెత్తారు. జనం అవసరాన్ని గుర్తించి చాపల వ్యాపారులు కేజీ చాపలు 200 నుండి 250 రూపాయలు వరకు పెంచి అమ్ముతున్నారు. ఈ సంవత్సరం కల్లూరు మండలంలో పెద్ద చెరువు తప్ప అన్ని చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో చేపలకు గిరాకీ పెరిగింది. మండలంలో చేపలు లేకపోవడం వల్ల దూర ప్రాంతాల నుండి తీసుకువచ్చు అమ్మడంతో రేట్‌ పెరగడానికి ఇదొక్క కారణం అని అంటున్నారు. మృగశిర కార్తె కావడంతో ప్రతి ఒక్కరూ చేపల కోసం రావడంతో రద్దీ బాగా పెరిగింది. దీనికి తోడు చాపల మార్కెట్‌ ప్రధాన రహదారి పక్కన ఉండటం వల్ల చేపలకు వచ్చినవారు ద్విచక్ర వాహనాలు రోడ్డుపైనే నిలపడంతో వచ్చే పోయే వాహనాలకు ఇబ్బంది మారింది. దీంతో ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడింది.