ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బార్సు అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. ఈ నెల 27న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హీరో ధర్మ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
మాది గుంటూరులోని హనుమాన్ జంక్షన్. మా తాతయ్య ఎగ్జిబిటర్. మా నాన్న కాకాణి బాబు శోభన్ బాబు, సుహాసిని జంటగా ‘పుణ్యదంపతులు’ సినిమాకు ఒక ప్రొడ్యూసర్‌గా చేశారు. సత్యానంద్ దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. నేను తొలుత ‘సింధూరం’ అనే సినిమాలో నటించాను.
ఈ కథ విన్నప్పుడు ఎగ్జైట్ అయ్యాను. వాస్తవంగా ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కథ ఇది. నేను వెళ్లి ఆ వ్యక్తిని కలిశాను. అతని లైఫ్‌లో జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాను. అయితే మా మూవీలో వాస్తవ ఘటనలకు కొంత ఫిక్షన్ కలిపి రూపొందించాం.
ప్రొడ్యూసర్ బసవరాజు శ్రీనివాస్‌కి చిరంజీవి మిత్రులు. అలా మా మూవీ కథ గురించి చిరంజీవికి చెబితే బాగుంది ప్రొసీడ్ అన్నారు.
ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి లవ్ స్టోరీ, మెసేజ్ కూడా ఉంటుంది. అయితే ఆడియెన్స్‌ను థియేటర్స్‌కు రప్పించడం కోసం కోసం ట్రైలర్, టీజర్‌లో యూత్ ఫుల్ కంటెంట్ చూపించాం. ఈ సినిమా చూసి మా నాన్న అప్రిషియేట్ చేశారు. సినిమా ఇండిస్టీకి వద్దన్న నాన్న ఇక్కడ సక్సెస్ అవుతావు అంటూ ఆశీర్వదించారు. ఇదే నా తొలి సక్సెస్.
మంచి సందేశమూ ఉంది
11:45 pm