– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్
నవతెలంగాణ – చండూరు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు పలికాలనే అభిప్రాయం టిడిపి క్యాడర్ లో ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన చండూరు టిడిపి కార్యాలయంలో విలేకరులతో తో మాట్లాడుతూ పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనపై అనేక పోరాటాలు ఉద్యమాలు చేశామని, బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దే దించడంలో కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు తమ వంతు పాత్ర పోషించామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కాకముందుకే ఐదు సంవత్సరాల ఉండవలసిన ప్రభుత్వాన్ని కుల కొడుతా పడగొడతాం అని బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాట్లాడడాన్ని ప్రజలు హర్షించరన్నారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావన ప్రజల్లో ఉందన్నారు .అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయాలనే అభిప్రాయానికి స్థానిక టిడిపి శ్రేణులు వచ్చినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మక్కెన అప్పారావు, మండల పార్టీ అధ్యక్షులు ఎర్రజల్ల లింగయ్య, దోమల వెంకన్న. మొగుదాల పార్వతమ్మ, నాయకులు పుప్పాల యాదయ్య, మారగోని పాపయ్య,గుదే మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.