వలసల నివారణతోనే రైతుల జీవితాల్లో వెలుగు

– రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
– రైతు వేదిక క్లస్టర్‌ సెంటర్లో రైతుల సంబురాలు
నవతెలంగాణ – వనపర్తి
వలసలను అరికట్టి, రైతుల జీవితాల్లో వెలుగులు నింపి, రైతే రాజుగా నేడు గ్రామ గ్రామాన రైతులు ”రైతు దినోత్సవాన్ని” ఆనంద ఉత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు..శనివారం నాగవరం సమీపంలోని రైతు వేదికలో రైతు దినోత్సవం వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆర్‌ లోకనాథ్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ డి వేణుగోపాల్‌, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌ సాయిచంద్‌, రాష్ట్ర మార్క్ఫెడ్‌ డైరెక్టర్‌ విజరు కుమార్‌, రైతు వేదికల అబ్జర్వర్‌ జ్యోతిర్మయి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు రమేష్‌ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ శ్రీధర్‌ గౌడ్‌, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు లక్ష్మయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, జిల్లా గొర్ల, కాపర్ల సంఘం అధ్యక్షులు కురుమూర్తి యాదవ్‌, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్‌, ఉద్యాన శాఖ అధికారి సురేష్‌, నాగవరం, రాజనగరం పిఎసిఎస్‌ చైర్మన్‌ లు మధుసూదన్‌ రెడ్డి, రఘు వర్ధన్‌ రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్‌ నరసింహులు. వ్యవసాయ శాస్త్రవేత్తలు భరత్‌ భూషణ్‌, శైల, విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకు ముందు ట్రాన్స్పోర్ట్‌ కార్యాలయం నుండి నాగవరం రైతు వేదిక వరకు జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ తో కలిసి ఎడ్ల బండిపై ర్యాలీగా రావటం సంతోషాన్ని కలిగిస్తున్నదని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవ వేడుకలను గ్రామ గ్రామాన ఆనందంగా నిర్వహించుకుంటున్నారని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సాధించలేని ఫలితాలను గత తొమ్మిది సంవత్సరాలలో వ్యవసాయ రంగంతో పాటు వివిధ రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించామని మంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుత తెలంగాణలో ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో, చెరువులు కుంటలు, ప్రాజెక్టులు నీళ్లతో కళకళలాడుతున్నాయని మంత్రి అన్నారు. వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆర్‌ లోకనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ఎక్కడ చూసినా రైతులు ఎంతో ఆనందంగా సంబరాలు నిర్వహించుకుంటున్నారని ఆయన అన్నారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు ఉండేవని, ప్రస్తుతం ప్రభుత్వ పథకాల ద్వారా రైతులు వ్యవసాయ సాగు సంతోషంగా చేస్తున్నారని ఆయన అన్నారు. రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తున్నదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సాంకేతికతను పెంపొందించేందుకే రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. రైతులు తమ సమస్యలను రైతు వేదికలలో చర్చించుకుని, శాస్త్రవేత్తల తగు సలహాలు, సూచనలు పొందుటకు రైతులకు ఈ వేదిక ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు. జిల్లాలో 1,64,479 మంది రైతులకు రైతు బంధు పథకం ద్వారా రూ. 1,602 కోట్ల రెండు లక్షల మొత్తాన్ని రైతు ఖాతాలలో జమ చేయడం జరిగిందని కలెక్టర్‌ వివరించారు. ఇప్పటివరకు మరణించిన రైతు వారసులకు రైతు బీమా పథకం ద్వారా 2,743 మంది రైతులకు రూ.137 కోట్ల 15 లక్షల మొత్తాన్ని రైతు బీమాగా చెల్లించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌ సాయి చందు మాట్లాడుతూ గిరిజన తండాలలో, మారుమూల పల్లెల్లో బతుకుదెరువు లేక, పంటలు పండక, నీటి, కరెంటు సౌకర్యాలు లేకపోవటంతో వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్లేవారని, వారి కుటుంబాల పరిస్థితులను అర్థం చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు అండగా నిలిచి ఉచిత కరెంటును అందిస్తున్నారని, పంట పొలాలకు పుష్కలంగా నీటిని సమకూర్చారని, పంట పెట్టుబడి కింద రైతుబంధు, ఉచిత విత్తనాల పంపిణీ ఏర్పాటు చేసి రైతులు ఏ విధంగా నష్టపోకూడదని అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో ఏ రైతును అడిగిన సంతోషంగా తమ కుటుంబాలతో ఏ ప్రాంతం వాళ్లు, ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్లు ఆయన సూచించారు.వ్యవసాయ మంత్రి కృషితో గొలుసుకట్టు విధానం ద్వారా చెరువులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలు నీటితో దర్శనమిస్తున్నాయని ఆయన అన్నారు. ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో ఎటు చూసినా పుష్కలంగా నీరు కనిపిస్తున్నదని, మంత్రి నీటిపారుదల, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి సాధిస్తున్నదని ఆయన అన్నారు. నేడు రైతు వేదికలను అందంగా ముస్తాబు చేసి, రైతులు సంబరాలు చేసుకోవడంపై ఆయన సంతోషంగా ఉందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అంతకు ముందు పెద్దగూడెం వ్యవసాయ మహిళ కళాశాల విద్యార్థులు సాయి శరణ్య మాట్లాడుతూ ఒకప్పుడు ఆడపిల్లలు పుడితేనే భారంగా భావించేవారని, ప్రస్తుత తెలంగాణలో గర్భిణీ స్త్రీ నుండి బిడ్డ పుట్టే వరకు సంరక్షణ బాధ్యత, కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల విద్యార్థి సుప్రజ మాట్లాడుతూ వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా, ఈ ప్రాంతంలోనే తాము చదువుకోగలుగుతున్నామన్నారు. నేర్చుకున్న విషయాలను రైతులు ఉన్న తమ తల్లిదండ్రులకు వివరించడం ద్వారా వారు పంట సాగు చేసుకోవడంలో ఉపయోగపడుతున్నాయని ఆమె తెలిపారు.నరసింహారావు, గొల్లపల్లి గ్రామంలో 10 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్నారని, సుమారు 10 లక్షల ఆదాయం లబ్ధి పొందినట్లు ఆయన వివరించారు. చంద్రయ్య, నందిమల్ల గడ్డ, ఒకప్పుడు వలసలు వెళ్లే వారిమని, ప్రస్తుతం ప్రభుత్వం నీటి సౌకర్యాలు కల్పించడంతో వరి పండిస్తున్నానని ఆయన తెలిపారు. సత్యనారాయణ. రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగి మాట్లాడుతూ ప్రస్తుతం నీటి సౌకర్యాలతో వ్యవసాయం ద్వారా అధిక దిగుబడి పొంది, ఆదాయం పొందుతున్నట్లు ఆయన వివరించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ 3.5 ఎకరాలలో పంటలు పండిస్తున్నానని, పంటల మార్పిడి ద్వారా అధిక ఆదాయాన్ని పొందుతున్నానని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పొందాలని ఆయన అన్నారు. మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత కరెంటు, నీటి సౌకర్యం కల్పించినందున వ్యవసాయం సాగు అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. హరీష్‌ రెడ్డి, (అంగవైకల్యం కలిగిన రైతు) కొత్తకోట, పది ఎకరాలలో వరి పంట సాగు చేసి అధిక దిగుబడి పొందుతున్నానని, వ్యవసాయ అధికారి సూచనల మేరకు ప్రస్తుతం ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్నట్లు ఆయన వివరించారు.వ్యవసాయ శాస్త్రవేత్త డా.భరత్‌ భూషణ్‌ మాట్లాడుతూ భూమిలో నత్రజని శాతం తెలుసుకొని పంటలు ఎంచుకోవాలని ఆయన అన్నారు. దీని ద్వారా భవిష్యత్తు తరాలకు మనం సారవంతమైన భూమిని అందించిన వారము అవుతామని ఆయన అన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పంట కాలాన్ని ముందుకు తీసుకువచ్చే విధంగా పంట వేయాలని ఆయన తెలిపారు. ఆర్గానిక్‌, జినుగా ఎరువులు వాడటం వలన భూమి సారవంతంగా ఉంటుందని, ప్రతి ఒక రైతు దీనిపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. డా. శైల, శాస్త్రవేత్త, పాలెం, మాట్లాడుతూ పంట సాగు చేసే ముందు విత్తన శుద్ధి. నేల శుద్ధికి ప్రాముఖ్యతనివ్వాలని ఆమె అన్నారు. పంట పొలాలకు తెగుళ్లు రాకుండా నివారిస్తుందని, వేప పిండి ఉపయోగించడం ద్వారా పంటలకు పురుగు, తెగుళ్లను నివారించవచ్చునని ఆమె తెలిపారు.డా. నరసింహారెడ్డి, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, మాట్లాడుతూ భూమిలోని మిథైల్‌ విష వాయువును నివారించాలని రైతులకు ఆయన సూచించారు. తడి, పొడి విధానాన్ని అవలంబించడం ద్వారా భూమి పాడవకుండా నివారించవచ్చునని రైతులకు ఆయన సూచించారు. ఇప్పటివరకు 16 జిల్లాలలో తడి, పొడి విధానాన్ని అమలు చేస్తున్నామని, వనపర్తి జిల్లాలో ఈ విధానంపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. అనంతరం రవి సాగర్‌, హరీష్‌ రెడ్డి, స్వామి ఉత్తమ రైతులను జిల్లా కలెక్టర్‌ తో కలిసి, మంత్రి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సుధాకర్‌ రెడ్డి, సురేష్‌, పెద్దగూడెం వ్యవసాయ మహిళ కళాశాల ప్రిన్సిపల్‌, వ్యవసాయ శాస్త్రవేత్తలు, జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, రైతు వేదిక సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోట : సీఎం కేసీఆర్‌ రైతాంగానికి పెద్ద పీట వేస్తూ..రైతును రాజుగా మార్చే దిశలో పరిపాలన కొనసాగిస్తున్నారని డీసీసీబీ డైరెక్టర్‌ కొట్టం వంశిధర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు.అందులో భాగంగా శనివారం రైతు దినోత్సవాన్ని కొత్తకోట మండలంలోని పాలెం, అమడబాకుల, అప్పరాల, కనిమెట్ట గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. పాలెం,సంకిరెడ్డి పల్లి నుండి రైతులు పెద్ద ఎత్తున కొట్టం వంశిధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో బయలుదేరారు. అలాగే సంకిరెడ్డి పల్లి నుండి పాలెం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మున్నా, రవీందర్‌, సీడీసీ చైర్మన్‌ చెన్నకేషవ రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్‌ జగన్మోహన్‌ రెడ్డి, మైబు, బాలకృష్ణ రెడ్డి, మాజీ మార్కెట్‌ సాక బాలనారాయణ,ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్‌,విద్యార్థి విభాగం నాయకులు శ్రీనుజీ,మమ్మలపల్లి సర్పంచ్‌ కురుమయ్య,సత్యహల్లి సర్పంచు వెంకటరామిరెడ్డి, అమడవాకుల ఎంపిటిసి శేసిరెడ్డి, బాబు రెడ్డి, ఆనంద్‌ రెడ్డి, వెంకటన్న గౌడ్‌, బాలరాజు, అలీం, లక్ష్మణ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
రేవల్లి : నాగపూర్‌ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల దినోత్సవ రైతు వేదిక క్లస్టర్‌ పరిధిలోని గల గ్రామలు గౌరిదేవి పల్లి, బండరాయి పకుల, శానాయిపల్లి గ్రామాల నుంచి రైతులు డిిప్యూటీ తహసిల్దార్‌” రామకృష్ణ పక్స్‌ ఛైర్మన్‌ రఘు యదవ్‌, రైతుబందు సమితి అధ్యక్షులు నారాయణరెడ్డి (వాయిస్‌ ఎంపీపీ) మధుసూధన్‌ రెడ్డి, ”ఎంపీడీవో” సుజాత. డిటి రామకృష్ణ,నాగపూర్‌ గ్రామ సర్పంచ్‌ జ్యోతి శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపిటిసి శ్రీశైలం,ఉపసర్పంచ్‌ సునిత వెంకటేష్‌,బండరాలు పకుల సర్పంచ్‌ జలగం పార్వతమ్మ,ఉపసర్పంచ్‌ రేణుక కిరణ్‌ ” గ్రామస్తులు” పాల్గొన్నారు
వీపనగండ్ల : మండల కేంద్రంతో పాటు గోపాల్దిన్నె కల్వరాల్ల పుల్గర్‌ చర్ల తూముకుంట బొల్లారం గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాలలో రైతులు తో కలిసి ప్రజా ప్రతినిధులు అధికారులు ర్యాలీలు నిర్వహించారు. వీపనగండ్లలో ఎంపీపీ కమలేశ్వరావుకు బి ఆర్‌ఎస్‌ మండల నాయకులు ముంత మల్లయ్య యాదవ్‌ శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ పాండు నాయక్‌ ఎంపీడీవో కథలప్ప, ఎంపీఓ బద్రీనాథ్‌, ఏపీవో శేఖర్‌ గౌడ్‌, ఏవో డాకేశ్వర్‌ గౌడ్‌, ఐసీడీఎస్‌ సూపర్వైజర్‌ లక్ష్మీనారాయణమ్మ, ఏపీఎం రాజశేఖర్‌ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ లక్ష్మీకాంత్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ రాఘవేందర్‌ మండల వైద్యాధికారి డాక్టర్‌ వంశీకృష్ణ, డాక్టర్‌ రాజశేఖర్‌ కొల్లాపూర్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ చాపల సాయిబాబా, తూముకుంట సింగిల్‌ విండో చైర్మన్‌ రామన్‌ గౌడ్‌ డైరెక్టర్‌, సంగనేనిపల్లి సర్పంచ్‌ ఆర్‌ మౌలాలి, తూముకుంట సర్పంచ్‌ మానస మౌలాలి, గోపాల్‌ దీన్నే సర్పంచ్‌ విజరు కుమార్‌, పుల్గర్‌ చర్ల సర్పంచ్‌ ఎద్దుల అరుణ సురేందర్‌ రెడ్డి, బి ఆర్‌ ఎస్‌ మండల అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు
ఆత్మకూరు : ఆత్మకూర్‌ అమరచింత మండల పరిధిలోని వివిధ క్లస్టర్‌ రైతు వేదికలలో శనివారం ఘనంగా రైతు దినోత్సవం నిర్వహించారు, మండల పరిధిలోని ఆరేపల్లి ,జూరాల, మూలమల్ల గ్రామాలలో రైతు దినోత్సవం నిర్వహించారు.కార్యక్రమంలో వివిధ గ్రామ సర్పంచులు ,ఎంపీటీసీలు ,రైతు సమితి సభ్యులు, జెడ్పీటీసీ మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు ,మండల ప్రత్యేక అధికారి అనిల్‌ ప్రకాష్‌, వైస్‌ ఎంపీపీ కోటేశ్వర్‌, క్లస్టర్‌ పరిధిలోని గ్రామ రైతులు పాల్గొన్నారు.
ములమల్ల రైతు వేదిక నందు క్లస్టర్‌ పరిదిలోని గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపీపీ బంగారు శ్రీనివాసులు ,ఆత్మకూరు మున్సిపల్‌ చైర్‌, పర్సన్‌ వైస్‌ చైర్మన్‌ ,మండల తాసిల్దార్‌ సింధుజ ,మాజీ ఎంపీపీ శ్రీధర్‌ గౌడ్‌ మండల ప్రత్యేక అధికారి అనిల్‌ ప్రకాష్‌ ,మరియు పిఎసిఎస్‌ అధ్యక్షులు గాడి కృష్ణమూర్తి ,మరియు క్లస్టర్‌ పరిధిలోని గ్రామాల రైతులు పాల్గొన్నారు.
జూరాలలో జరిగిన రైతు దినోత్సవంలో గ్రామ ప్రజలు రైతు వేదిక సమీపంలో సమావేశం ప్రారంభంలో సమీపంలో కాలనీకి చెందిన ప్రజలు కాలనీలోని అంజనేయ స్వామి దేవాలయం గతంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చి నెరవేర్చలేదని అందుకు నిరసనగా సమీపంలోని విద్యుత్‌ ట్రాన్స్ఫార్మర్‌ నిలుపుదల చేశారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వినరు కుమార్‌, కార్యక్రమంలో క్లస్టర్‌ పరిధిలోని గ్రామ సర్పంచులు ,పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారి నారాయణ ,మండల విద్యాధికారి, భాస్కర్‌ సింగ్‌, వీవిద గ్రామాల రైతులు పాల్గొన్నారు.
పెద్దమందడి : తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశంకే దిక్సూచిగా పనిచేస్తున్నాయని జిల్లా రైతుబంధు అద్యక్షులు జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు. శనివారం పెద్దమందడి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన రైతు వేదికలలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగల్‌ విండో ప్రెసిడెంట్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, సింగల్‌ విండో డైరెక్టర్లు, ఉప సర్పంచ్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
రెేవల్లి : చెన్నారం గ్రామంలో రైతు వేదిక క్లస్టర్‌ పరిధిలో చీరకపల్లి, గొల్లపల్లి, గాంధీనగర్‌, రైతు దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సతీమణి ”సింగిరెడ్డి వసంతి” హాజరయ్యారు. చెన్నారం క్లస్టర్‌ పరిధిలోని మూడు గ్రామాల రైతులు చెన్నారం బస్టాండ్‌ దగ్గర డప్పు వైద్యాలతో ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి ఎంపీపీ సేనాపతి, చెన్నారం గ్రామ సర్పంచ్‌ రమేష్‌, చిర్కపల్లి గ్రామ సర్పంచ్‌ దొడ్ల ఇంద్ర రాములు , గొల్లపల్లి గ్రామ సర్పంచ్‌ సునీల్‌, మూడు గ్రామల రైతు కోఆర్డినేటర్స్‌ నాగిరెడ్డి, అర్జున్‌ రావు, రాములు, మూడు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మరియు తహసిల్దార్‌ శ్రీరాములు, మండల పంచాయతీ ఆఫీసర్‌ భవాని, హాజరయ్యారు.
పెద్దమందడి : పెద్దమందడి మండల పరిధిలోని మొజర్ల కొండా, లక్ష్మణ్‌ డాక్టర్‌ పి.సైదయ్య ఉద్యాన కళాశాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా కళాశాల ఆవరణలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థి వ్యవహారాల అధికారి బి. రాజశేఖర్‌, డాక్టర్‌ విజయ, డాక్టర్‌ పూర్ణిమ మిశ్ర, డాక్టర్‌ షహనాజ్‌, బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.