ఎస్సీ డిక్లరేషన్ కు నిధుల కేటాయింపు లేదు

There is no allocation of funds for SC declaration– మద్దినేని తేజ రాజు బీజేపీ మండల అధ్యక్షుడు
నవతెలంగాణ – గోవిందరావుపేట
చేవెళ్ల సభలో కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ అమలుకు బడ్జెట్లో నిధుల కేటాయింపు లేదని బిజెపి మండల అధ్యక్షుడు మద్దినేనితేజరాజు అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ పిలుపుమేరకు మండల దళిత మోర్చా ఆధ్వర్యంలో మండల మెజిస్ట్రేట్ సబ్ రిజిస్టర్ మరియు తాసిల్దార్ సృజన్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదని వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం  ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని తేజరాజు మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల లో నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రధాన హామీలైన అంబేద్కర్ అభ్యాసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు షెడ్యూల్డ్ కులాల సాంఘిక సంక్షేమ వసతి గృహాల పునర్నిర్మాణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకపోవడాన్ని బిజెపి పార్టీ నిరసన వ్యక్తం చేస్తున్నదన్నారు . అంబేద్కర్ అభయ హస్తం క్రింద ప్రతి కుటుంబానికి రూ.12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలి.  ఎస్సీ ఉప కులాల మాల మరియు మాదిగ కార్పొరేషన్లకు సంవత్సరానికి 750 కోట్లు కేటాయించాలి  ప్రతి ఎస్సీ కుటుంబానికి శాశ్వత ఇళ్ళ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలి  ఎస్సీ హాస్టల్స్ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలి ఐదో డిమాండ్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధికై సబ్సిడీ రుణాలకు సంవత్సరానికి రూ.1000 కోట్ల కేటాయించాలి ఈ యొక్క కార్యక్రమాన్ని దళిత మోర్చా మండల అధ్యక్షులు మంగ రవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ప్రచార కార్యదర్శి రుద్రారపు సురేశ్, యువ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీకాంత్, ఆచారి బొల్లం మురళి, అంతిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వలపదాస్ రవిశంకర్, ఆనందరావు, రామిడి యశ్వంత్ రెడ్డి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.