– ఇతర పార్టీ నాయకులు తమపై బురద చల్లుతున్నారు..
– లోక్ సభ ఎన్నికల్లో గెలిచేది బీఅర్ ఎస్. అభ్యర్థి మాత్రమే..
– భారీ మెజార్టీతో టిఆర్ఎస్ జహీరాబాద్ సి2 గెలవబోతున్నాం..
నవతెలంగాణ నాగిరెడ్డిపేట్
టిఆర్ఎస్ పార్టీ నుండి ఇతర ఏ పార్టీలకు మారే ఆలోచన లేదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్పష్టం చేశారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీని వదిలి ఇతర ఏ పార్టీలోకి వెళ్లే ఆలోచనలో తానులేనని ఆయన స్పష్టం చేశారు. ఇతర పార్టీల నాయకులు తమపై బురద చెల్లె ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీలను సర్పంచ్లను కోన్నట్టు తమను కోనలేరని ఆయన అన్నారు. తాము బీ ఆర్ఎస్ పార్టీలోనే ఉండి టిఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజారిటీ గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిజెపి రెండు జాతీయ పార్టీలు కూడా ప్రజా పాలనలో విఫలం కావడం జరిగిందని ప్రజలను అన్ని రకాలుగా అభివృద్ధి పరిచే పార్టీ బీ ఆర్ఎస్ పార్టీ మాత్రమేనని లోక్సభలో తెలంగాణ తరఫున గొంతు విప్పి మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ లోక్సభ మెంబర్ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలు మోసపూరిత గ్యారెంటీలని ఆ పథకాల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. గతంలో రైతు బీమా వారంలోగా అందించే వాళ్ళమని ఇప్పుడు రెండు నెలలు గడుస్తున్నా రైతు బీమా పథకం డబ్బులు బాధితులకు రావడంలేదని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ ప్రజలు కేవలం బిఆర్ఎస్ పార్టీని నమ్ముతారని విఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త తిరుమల్ రెడ్డి తోపాటు బీ ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య తోపాటు ఎంపిటిసి శ్రీనివాస్ నారాయణ తో పాటు నాయకులు హనుమంత్ రెడ్డి, సంతోష్ గౌడ్, వెంకటరెడ్డి, ఫరీద్, లక్ష్మీకాంతం, కృష్ణ ,మంగలి యాదగిరి, ఆత్మకూరు బాబురావు, వంశీ గౌడ్ తదితరులున్నారు.