వైస్ ఎంపీపీ పై అవిశ్వాస నెగ్గేనా.?

నవతెలంగాణ – రామారెడ్డి
వైస్ ఎంపీపీ తో పాటు ఇద్దరు ఎంపిటిసిలు క్యాంపు రాజకీయం మండల ఎంపిటిసిలు ఎంపీపీ, వైస్ ఎంపీపీ లపై అవిశ్వాస తీర్మాన నోటీసును ఆర్డీవోకు గతంలో అందజేయగా, నేడు ఉదయం 11 గంటలకు ఆర్డీవో వై రంగనాథ రావు ఆధ్వర్యంలో ఎంపీడీఓ కారులయాలో అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించనుండగా, ఎంపీపీ దశరథ్ రెడ్డి కోర్టు నుండి స్టేట్ తెచ్చుకోగా, వైస్ ఎంపీపీ పై అవిశ్వాస పై ఓటింగ్ నిర్వహించనున్నందున, వైస్ ఎంపీపీ రవీందర్ రావు తో పాటు, అన్నారం ఎంపీటీసీ గడ్డం చంద్రకళ గంగారెడ్డి, సింగరాయపల్లి ఎంపిటిసి సత్యాలి చంద్రు నాయక్ క్యాంపు కి వెళ్ళినట్లు విశ్వాసనీయ సమాచారం. అవిశ్వాసం నెగ్గాలంటే పదిమంది ఎంపిటిసిల్లో ఏడుగురు ఎంపీటీసీలు మద్దతు ఇవ్వాల్సి ఉండగా, వైస్ ఎంపీపీ తో పాటు ఇద్దరు ఎంపిటిసిలు క్యాంపు కి వెళ్ళగా, ఎంపీపీ మద్దతు ఉండకపోవడంతో అవిశ్వాసం నెగ్గుతుందా అని చర్చ కొనసాగుతుంది.