– నవతెలంగాణ వార్తకు స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ
నవతెలంగాణ – భువనగిరి
తొలిచూరు కాన్పు ఆపరేషన్లు చేస్తున్నారని హార్దిక ప్రయోజనాల కోసమే ప్రైవేటు ఆసుపత్రులు అనవసరమైన ఆపరేషన్లు చేస్తున్నారని మే 8వ తేదీన నవ తెలంగాణలో వార్తా కథనం వచ్చింది. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం వహిస్తుందని ఆ వార్త అంశంలో పేర్కొనడంతో పాటు జిల్లా అధికారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. దీనికి స్పందించిన కలెక్టర్ జిల్లా అధికారులకు తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎటికేలకు జిల్లా వైద్యాధికారులు స్పందించి బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ఆసుపత్రులను తనిఖీ చేశారు. వారికి హెచ్చరిక జారీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వై పాపారావు నేరుగా ఆసుపత్రులు యొక్క రిజిస్టర్ లను తనిఖీ చేశారు. పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆ ఆసుపత్రులు సీజ్ చేస్తారని హెచ్చరించారు.
సాధారణ ప్రసవాలు ముద్దు.. కడుపు కోతలు వద్దు..
జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో డిప్యూటీ డి.ఎం.అండ్ హెచ్.వో లు, ప్రోగ్రామాధికారుల బృందం భువనగిరిలోని జయలక్ష్మి హాస్పిటల్, నిర్మల హాస్పిటల్, కేకే ప్రైవేటు నర్సింగ్ హోమ్ ఆస్పత్రులలో అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. వై. పాపారావు మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో నిబంధనకు విరుద్ధంగా చాలా ప్రైవేట్ ఆసుపత్రిలో సాధారణ కాన్పులు తగ్గించి సిజేరియన్ కాన్పుల్ ఎక్కువగా చేస్తున్నారన్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనకు వ్యతిరేకం అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే తల్లుల్లో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు తగిన కారణాలు లేకుండా సిజేరియన్ చేసినచో కఠిన చర్యలు ఉంటాయన్నారు. వైద్యబృందం తిరిగి మూడు ఆసుపత్రుల్లో రిపోర్ట్లు పేషంట్ కే సీట్లు పరిశీలించారు.వీటిలో కొన్ని కాన్పులకు సరైన కారణాలు పొందుపరచలేదని వీటి విషయంలో ముందుగా నోటీసులు అందజేయడం జరుగుతుందని తెలిపారు నిబంధనలు ఇప్పటివరకు ప్రిన్స్ ఆసుపత్రి, గాయత్రీ హాస్పిటల్, మహేంద్ర ఆసుపత్రిలకు నోటీసులు ఇవ్వడం జరిగింది తిరిగి వారి వివరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం తదుపరి చర్యలు ఉంటాయన్నారు అర్హత లేని వారు సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్టయితే అలాంటి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలందరూ ముహూర్తాలు పాటించి మంచి రోజున అను నొప్పులు భరించలేని సిజరిన్లకి ముగ్గు చూపకూడదని కాన్పులోచ్చే వరకు ఆగి సాధారణ ప్రసవాలు చేయించుకోవాలన్నారు. ఉమ్మనీరు పెంచుకోవడానికి రక్తం తగినంత ఉండేలా చూసుకోవడానికి వైద్యుల సూచనలు మేరకు ఆహార పదార్థాల ద్వారా పొందాలన్నారు. తదుపరి మూడు రోజులు జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్న ఆసుపత్రిలో తనిఖీలు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డా. శిల్పిని, డా. యశోద, ప్రోగ్రాం అధికారులు డా. సుమన్ కళ్యాణ్, డెమో మధుసూదన్ రెడ్డి, సిహెచ్ఓ నగేష్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.