ఎమ్మెల్యే కడియం శ్రీహరి అల్లుడు నజీర్, వల్లపురెడ్డి రామిరెడ్డి ల పైన కల్లబొల్లి మాటలతో అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు.మండలంలోని ముప్పారం గ్రామంలో వారు శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. అటవీ భూములపై అక్రమ పట్టాల చేస్తున్నారని సరియైన ఆధారాలు లేకుండా ప్రజల మెప్పుకోసం అసత్య ఆరోపణలు చేసిన స్టేషన్గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మిస్ సిగ్గుగా బె శరత్ గా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగు మండలాల మధ్య ఉన్న ఇనుప రాతి గుట్టల్లో 3950 ఎకరాల భూమి ఆనుకొని ఉన్న రైతుల పట్టా భూములను ఎవరి భూములు వారికే ఉన్నాయంటూ రైతులు పాసుబుక్కులు చూపించారు. గురువారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ప్రెస్ మీట్ పెట్టిన విషయం పాఠకులకు వివిధమే,కానీ స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అల్లుడు నజీర్, రైతు వల్లపరెడ్డి రాంరెడ్డి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నాడని ఆరోపణలు చేయడం సరి అయింది కాదని విమర్శించారు.స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీలాంటి నీచ రాజకీయాలు చేయడని,ఆయన పేరు ప్రఖ్యాతలు కలిగిన, నిజమైన రాజకీయ నాయకుడని అన్నారు. ఈ సందర్భంగా రైతు వల్లపు రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సర్వే చేసి, మా రికార్డు ప్రకారంగా మాకు భూములు ఇప్పిస్తే సరిపోతుంది. అక్రమంగా ఫారెస్ట్ భూమి మాకు ఏ పరిస్థితుల్లో అవసరం లేదన్నారు.మాజీ ఎమ్మెల్యే రాజయ్య మంత్రిగా ఉన్న సమయంలో ఇదే ప్రాంతంలో టెక్స్టైల్ పార్కును, తన అసమర్థ పాలన వల్ల పరకాల నియోజకవర్గానికి తరలించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మండలానికి అన్యాయం చేసింది ముమ్మాటికి డాక్టర్ రాజయ్య అనే విమర్శించారు. తను రాజకీయ పబ్బం కోసం ఇలాంటి నీచనికి దిగజారడం సరికాదని హెచ్చరించారు. ఇకపైన ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే ఈ ప్రాంత రైతులే తనకు సరైన బుద్ధి చెప్తారని హేళన చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు భాష,మాజీ సర్పంచులు చాడ నరసింహారెడ్డి,పెసరు రమేష్,మాజీ ఎంపిటిసిలు పెద్ది శ్రీనివాస్, రైతులు నారాయణ, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.