– శంషాబాద్ మాజీ ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్
– తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్
– కొద్దిమంది నాయకులు మారినంత మాత్రాన మా పార్టీ ఉనికి కోల్పోదు
– ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అధికారం మళ్లీ మనదే
నవతెలంగాణ-శంషాబాద్
ఎవరు పార్టీలు మారినా తాము మాత్రం కన్నతల్లి లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్లోనే ఉంటామని పార్టీని వీడే ప్రసక్తే లేదని శంషాబాద్ మాజీ ఎంపీపీ విద్యాల జయమ్మ శ్రీనివాస్ అన్నారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో శనివారం ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రస్తుత రాజకీయ పరిస్థి తుల్లో బీఆర్ఎస్కు కొంత ఎదురుదెబ్బ తలిగినప్పటికీ మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం పునాదులుగా పార్టీ ఏర్పడిందని అన్నారు. దశాబ్ద కాలంలో కేసీఆర్ తెలంగా ణను అద్భుతంగా తీర్చిదిద్దారని చిన్నపాటి లోపాల వల్ల పార్టీ అధికారం కోల్పోయి నప్పటికీ బీఆర్ఎస్ మేలు అనేే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతుందని అన్నారు. రాజకీయ స్వలాభం కోసం వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతాయి వచ్చే నష్టం ఏమీ లేదని పార్టీకి ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్కు శంషాబాద్ మండలం కంచుకోటగా ఉందని కొద్దిమంది నాయకులు మారినంత మాత్రాన తమ పార్టీ ఉనికి కోల్పోలేదని అన్నారు చాలామంది కాంగ్రెస్లోకి వెళ్లడానికి ఇష్టపడతలేరన్నారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళితే ప్రజలు తిరస్కరిస్తారని ఆమె తెలిపారు. ఏదేమైనా పార్టీ శ్రేణులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ నాయకత్వం అంతా నినాదించాల్సిన సమ యం ఆసన్నమైందని అన్నారు. పార్టీ కార్యకర్తలు అంద రూ ఐక్యంగా ముందుండి పోరాడాలని తాము కూడా పోరాటంలో భాగస్వామ్యం అవుతామని ఎంపీపీ అన్నారు.