ఇలాంటి సినిమారాలేదు

విశ్వక్‌ సేన్‌ నటించిన తాజా చిత్రం ‘గామి’. విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో కార్తీక్‌ కుల్ట్‌ క్రియేషన్స్‌పై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్‌ ఫండ్‌ చేశారు. వి సెల్యులాయిడ్‌ ప్రజెంట్‌ చేస్తోంది. ఈ చిత్రం ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్‌ సేన్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ‘దర్శకుడు విద్యాధర్‌ నేను చేసిన ‘వెళ్లిపోమాకే’ చూసి సంప్రదించారు. ఈ సినిమాకి ఐదేళ్ళు పడుతుందని నాకు ముందే తెలుసు. అయితే ఇది ఎప్పుడొచ్చిన కొత్తగా ఉండే సినిమా. ఎందుకంటే ఈ తరహాలో ఇప్పటివరకూ ఎవరూ తీయలేదు. ఇది చాలా ఎమోషనల్‌ ఫిల్మ్‌. క్యారెక్టర్స్‌కి కనెక్ట్‌ అయిన తర్వాత సెకండ్‌ హాఫ్‌ స్క్రీన్‌ ప్లే మొత్తం ఊపి రాడనివ్వదు. ఈ సినిమాకి పెద్ద కమర్షియల్‌ ఎలిమెంట్‌ ఎమోషన్‌. ఖచ్చితంగా ఇంటర్నే షనల్‌ స్థాయిలో ఒక క్రిస్టఫర్‌ నోలన్‌ సినిమా చూసిన అను భూతిని అందిస్తుంది. ప్రస్తుతం సినిమాని పీసిఎక్స్‌ ఫార్మెట్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. ఒక తెలుగు సినిమా ఈ ఫార్మెట్‌ లో రావడం ఫస్ట్‌ టైం’ అని అన్నారు.