బీఆర్ఎస్ లో ఇన్ని రోజులు పట్టించుకున్న నాధుడే లేడు..

– కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి చేరాము..
– పార్లమెంట్ ఎన్నికలవేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్..
– వేములవాడ మున్సిపల్  కౌన్సిలర్ గూడూరి లక్ష్మి- మధు..
నవతెలంగాణ – వేములవాడ
బీఆర్ఎస్ లో ఇన్ని రోజులు పట్టించుకున్న నాధుడే లేడు ప్రేమ, ఆప్యాయతలకు అభివృద్ధికి నిలువెత్తు రూపం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు నచ్చి కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో చేరడం జరిగిందని, 25 వార్డ్ కౌన్సిలర్ గూడూరి లక్ష్మి- మధు అన్నారు. వేములవాడ పట్టణం 25 వార్డుకు చెందిన గూడూరి లక్ష్మి- మధు సుమారు 100 మందితో బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వారికి  ప్రభుత్వ విప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గూడూరి లక్ష్మి- మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందన్నారు. 25 వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.. అందరం కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బింగి మహేష్, పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరo వెంకటస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, నాయకులు పుల్కం రాజు, చిలుక రమేష్, పులి రాంబాబు గౌడ్, వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.