నవతెలంగాణ – ఢిల్లీ
బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. అఖిలపక్ష భేటీలో ఆయన మాట్లాడుతూ.. ఆ దేశంలో ఉన్న భారతీయులను తరలించేంత ప్రమాదకరంగా పరిస్థితులు లేవన్నారు. భవిష్యత్ ప్రణాళికను ఆలోచించుకోవడానికి బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరింత సమయం ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. అక్కడ ఎన్నికలు జరిగే వరకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు.