కాంగ్రెస్లో మహిళలకు సముచితం స్థానం లేదు 

దుబ్బాక లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
– కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కత్తి కార్తీక 
– మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక
నవతెలంగాణ- దుబ్బాక రూరల్:  కాంగ్రెస్లో మహిళలకు సముచితం స్థానం లేదని మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ అన్నారు. శుక్రవారం
తెలంగాణ రాష్ట్ర భవన్ లో మంత్రి హరీష్ రావు  సమక్షంలో కత్తి కార్తీక గౌడ్ 30 మందితో కలిసికాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు  మాట్లాడుతూ కత్తి కార్తీక బీఆర్ఎస్ పార్టీలో చేరడం శుభ పరిమాణం అని ఆమె ఉన్నత విద్యావంతురాలు అని బలమైన నాయకురాలు అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆమెకు పార్టీలో సముచితస్థానం కల్పిస్తామని విధేయతతో పాటు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని  పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు స్థానం ఉండదని, మహిళ బీసీ బిడ్డలకు టిక్కెట్లు ఇవ్వరని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కత్తి కార్తీక రాజకీయ భవిష్యత్తు బాధ్యత తనదేనని మంత్రి హామీ ఇచ్చారు. తదనతరం కత్తి కార్తీక గౌడ్ మాట్లాడుతూ పార్టీలో బీసీ మహిళ బిడ్డ అయిన తనకు సముచిత స్థానం కల్పించలేదని, ఏడాది పాటు కాంగ్రెస్ పార్టీ లో కష్టపడి దుబ్బాక లో చైతన్యం చేస్తే తనకు టికెట్ ఇవ్వలేదని ఆ పార్టీ సిద్ధాంతాలు, రేవంత్ రెడ్డి విధానాలు నచ్చక పార్టీ వీడి బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. మెదక్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపుకోసం పని చేస్తానని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో కొత్త దేవి రెడ్డి, సాయ గౌడ్,కుమ్మరి రవీందర్, చాకలి నాగులు పట్నం రాములు, ఐరేని సాయితేజ గౌడ్, మహేందర్ గౌడ్, దుబ్బ రాజా గౌడ్, శ్రీనివాస్, బిక్షపతి, పరశురాములు, లింగం రాజు, చిట్టిపాక రాజు, రషీద్, బాబా, అనిల్, రఫీ, నరేందర్ తదితరులు ఉన్నారు.