మంత్రిపై చౌకబారు విమరలు చేస్తే ఊరుకునేది లేదు 

– మండల పార్టీ అధ్యక్షులు వైనాల రాజు
నవతెలంగాణ – రామగిరి
ఈరోజు కూలలా ప్రస్తావన తీస్తున్న పుట్ట మధు నువ్వు అధికారంలో ఉండి మంథని నియోజకవర్గంలో ఏ బీసీకి ప్రాధాన్యత ఇచ్చావు ఎవర్ని ఎదగనిచ్చావు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ఆత్మ సాక్షిగా నువ్వే చెప్పు మంథని నియోజక వర్గాన్ని నాశనం చేశావు అని  కమాన్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనలా రాజు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంథనిలో పోటీ చేసే దమ్ము లేక కమాన్పూర్ నీ ఏమి ఉద్దరించావని కమాన్పూర్ లో పోటీచేసి జడ్పీ చైర్మన్ బాధ్యత తీసుకొని 10సంవత్సరాలు అధికారం పట్టుకొని ఏ బీసీకి ప్రాధాన్యత ఇచ్చావు 10 సంవత్సరాల అగ్రవర్ణమైన ఒక రెడ్డికి పార్టీ ప్రెసిడెంట్ పదవిని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద మండలం అయినటువంటి కమాన్పూర్ మండలాన్ని అతి చిన్న మండలాన్ని చేసావ్ నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంటి అనేది చెప్పకుండా ప్రతి మాటకు శ్రీధర్ బాబు ను విమర్శలు చేస్తూ రాజకీయం చేయడంసరైనది కాదనీ హితవు పలికారు. అదే విధంగా  ఇప్పుడు ప్రజలు నువ్వు ఏం చెప్పినా నమ్మడానికి లేరనీ చాలు నీ రాజకీయమని ప్రజలే బుద్ధి చెప్పి నిన్ను వద్దంటూ ఉంటే నువ్వు పదే పదే శ్రీధర్ బాబు ను విమర్శలు చేస్తూ అతని తమ్ముడిపై విమర్శలు చేస్తు, ఇద్దరు ముగ్గురిని సబ్జెక్టు లేని స్వార్థపరులను పక్కన పెట్టుకొని విమర్శ చేయడం మానుకొని చర్చకు కూర్చుందాం నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి మా సార్ చేసిన అభివృద్ధి ఏంటో నీకు దమ్ముంటేరా  పదే పదే విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు నువ్వు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఎన్ని ఫామ్ హౌస్ లు కట్టావు ఎన్ని ఎకరాల భూమిని కబ్జా చేశావు ప్రజలు చూస్తున్నారనీ అన్నారు.
అలాగే మీ కేసీఆర్ ఎంత అవినీతిపరుడు నువ్వు ఎంత అవినీతిపరుడు కాలమే నిర్ణయిస్తుందనీ దొంగే దొంగ అన్నట్టుగా నీ విమర్శలకు ప్రజలు బుద్ధి చెప్పారు కానీ, నీకు సిగ్గు లేక చట్టాన్ని కూడా విమర్శ చేస్తున్నావు చట్టము ఎవరికీ చుట్టం కాదు అన్న విషయాన్ని మర్చిపోతున్నావు చట్టం చేసే పని కూడా ముందుంది గుర్తుచేస్తూ కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో కమాన్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వైనాల రాజు మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధి చొప్పరి శేఖర్, గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం శీను, బూస తిరుపతి యాదవ్, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ బుర్ర సత్యం, మండల కార్యదర్శి కూసన రవి,యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బంగారు మహేష్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మాదరబోయిన ముత్యాలు యాదవ్,  సాగర్ల శంకర్, మామిడి రాజు, కొమ్ము గోపాల్, కటిక రెడ్డి తిరుపతి, మామిడి అనిల్, పోలు దాసరి సంపత్, జంగా సతీష్, చీకుర్ల శ్రీనివాస్, సాధుల శ్రీధర్, కొంతం నిరంజన్,తదితరులు పాల్గొన్నారు.