నవతెలంగాణ-ధర్మసాగర్ : మహిళల మీద చౌకబార్ మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని టిపిసిసి ఉపాధ్యక్షులు బండ్రు శోభారాణి అన్నారు. మండలంలోని మలక్ పల్లి, ధర్మపురం, కరుణాపురం, రాంపూర్, పెద్ద పెండ్యాల గ్రామలలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండురావు,టిపిసిసి ఉపాధ్యక్షులు బండ్రు శోభ రాణి, స్టేషన్గన్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండురావు మాట్లాడుతూ ఆరు నెలల క్రితం జరిగిన కర్ణాటక సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు పథకాలను ప్రజలు ఆదరించి, కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీతో ఓట్లు వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం మా ముఖ్యమంత్రి మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.ఈసారి తెలంగాణ రాష్ట్రంలో సోనియాగాంధీ నేతృత్వంలో ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటిసారి క్యాబినెట్ మీటింగ్లో తప్పకుండా అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటల్లో పడి ఇప్పటికే రాష్ట్రం ఆగమవుతుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సింగపురం ఇందిరకి తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా కోరారు. అనంతరం టిపిసిసి ఉపాధ్యక్షురాలు బండ్రు శోభ రాణి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి మహిళల పట్ల అనుచితమైన వాక్యాలు చేయడానికి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని బట్టి ఓడిపోతానని భయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీరు మహిళల వ్యక్తిగతంగా విమర్శించడం కాదు, ప్రత్యక్షంగా రాజకీయంగా ఎదుర్కొని పోరాడాలని, మహిళా మణుల పట్ల చౌకబారు మాటలు మాట్లాడుతూ మహిళలకు కించపరిచినట్లైతే, ఈ ఎన్నికల్లో మహిళలు తగిన బుద్ధి చెప్తారు సవాలు విసిరారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర మాట్లాడుతూ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరులేదని ప్రజలు గమనిస్తున్నారని, జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజల ముగ్గు చూపుతున్నారని అన్నారు. ఇచ్చిన మాటకు సోనియాగాంధీ కట్టుబడి తెలంగాణ ఇచ్చారని, మాట తప్పిన ఘరానా మోసగాళ్లకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని ఆరోపించారు. ఓటమి భయంతో కడియం శ్రీహరి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఈ స్టేషన్గన్పూర్ నియోజకవర్గ మహిళ మణులు, అక్కాచెల్లెళ్లు అందరూ వింటున్నారన్నారు.నీ అహంకార మాటలకు వారు ఓటుతో నీకు మీ అహంకారానికి తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలను వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా వారిలో మలకపల్లి గ్రామ సర్పంచి మంద ఎల్లమ్మ, ఎంపీటీసీ తాటికాయల రత్నం, నియోజకవర్గ ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ మంద ఆరోగ్యం వారితోపాటు టిఆర్ఎస్ కార్యకర్తలు దాదాపు 100 మంది సభ్యులను పార్టీలో చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ మహిళా యామిని, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దివాకర్, పిఎసిఎస్ డైరెక్టర్ బొడ్డు లేనిన్, పార్టీ పురముకులు, గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.