బిఆర్ఎస్ పార్టీలో సేవ రాజకీయాలు లేవు వ్యాపార రాజకీయాలే కొనసాగుతున్నాయి

– రాజకీయ అవకాశం ఇవ్వలేకనే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్న సంగమేశ్వర్
నవతెలంగాణ మద్నూర్; బి ఆర్ ఎస్ పార్టీలో సేవా రాజకీయాలు లేవని వ్యాపార రాజకీయాలే కొనసాగుతున్నాయని ఇలాంటి రాజకీయాలు నచ్చకనే మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంగమేశ్వర్ గురువారం రాత్రి తన సొంత గ్రామమైన కొడిచెర గ్రామంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటించారు పార్టీలో 20 సంవత్సరాల కాలంగా పార్టీ సేవ కోసమే పనిచేస్తున్నాను ప్రస్తుతం పార్టీలో సేవా రాజకీయాలు లేకుండా పోయాయని వ్యాపార రాజకీయాలుగా మారాయని తెలిపారు పార్టీలో రాజకీయ అవకాశాలు ఇవ్వలేకనే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు ఇటు పార్టీకి అటు ఎమ్మెల్యేకు నావల్ల నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో పదవిని అడ్డం పెట్టుకొని రాజకీయం లో ఉండకూడదని ఆలోచనతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పార్టీలో కార్యకర్తలకు ఎలాంటి సంఘటనలు వచ్చిన ఎమ్మెల్యే హనుమంతు షిండే మౌనంగా ఉండడం వ్యాపార రాజకీయాలకు తాగిస్తుందని సేవా రాజకీయాలు ఉండాలి కానీ వ్యాపార రాజకీయాలు కొనసాగుతున్నందున పార్టీ సిద్ధాంతాలు నచ్చకనే ఏఎంసీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు నాకు నమ్ముకున్న కార్యకర్తలకు ఎలాంటి ఆపద సాపద వచ్చిన ఎల్లవేళల సేవలు అందిస్తానని తెలిపారు