తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేవు

– మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘హైదరాబాద్‌లో తాగు నీటికి కట కట’ అంటూ వస్తున్న వార్తలపై జిల్లా ఇంచార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించారు.. ప్రస్తుతం కృష్ణ తాగు నీటి సరఫరా వ్యవస్థ పై ఎలాంటి భయందోళనలు అవసరం లేదని తెలిపారు. అత్యవసర పంపింగ్‌ ఏర్పాట్ల కోసం 2017 సంవత్సరంలో మాదిరిగానే ప్రస్తుత నీటి పంపింగ్‌ ప్రక్రియ కూడా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో జీహెచ్‌ఎంసీ ప్రాంతాలకు నిరంతరాయంగా నీటి సరఫరా అందుతుందని తెలిపారు.