ఆదిలాబాద్ జిల్లాలో కళాకారులకు కొదవలేదు

There is no shortage of artists in Adilabad district– మాజీమంత్రి జోగురామన్న
– అట్టహాసంగా సినిమా ప్రారంభోత్సవం
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ జిల్లాలో కళాకారులకు కొదవలేదని అదిలాబాద్ అందాలు సినీ పరిశ్రమతో పాటు  టూరిస్టులు సైతం ఆకట్టుకుంటుందని మాజీమంత్రి జోగురామన్న అన్నారు. యువత సినిమా రంగంలో తమ కలను నిరూపించుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. శనివారం పట్టణంలోని యాదవ సంఘం భవనంలో నూతన సినిమా ప్రారంభోత్సవానికి హాజరై క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఏబి క్రియేషన్ ఆధ్వర్యంలో డైరెక్టర్ గాజు గౌడ్ దర్శకత్వంలో నూతన చిత్రం రూపొందించారు. మొదట వినాయకుడి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జోగు రామన్న  మాట్లాడుతూ.. యువత కళా నైపుణ్యానికి పదును పెడుతూ చిత్ర పరిశ్రమల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4వేల కోట్లతో ఆదిలాబాద్ గణనీయంగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. చిన్నపాటి సినిమాలకు సైతం ఆదిలాబాద్ లొకేషన్ లో ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. పలు సినిమాలలో సైతం ఆదిలాబాద్ ఎంతగానో పేరుపొందిందని అన్నారు. ఏపీ క్రియేషన్ వారిని అభినందిస్తూ వాటికి పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. యువతీ యువకులు వారి నటన కళా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ సినిమా చిత్ర పరిశ్రమల రాణించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, బట్టు సతీష్, చిన్న పటేల్, డైరెక్టర్ గజ్జు గౌడ్, భూపతి, నారాయన్ రెడ్డి, హీరో కళ్యాణ్, హీరో బిమేష్, హీరోయిన్ యోగితా, విల్లన్ సాగర్ పాల్గొన్నారు.