పన్నుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్: కిషన్ రావు

నవతెలంగాణ – డిచ్ పల్లి
గ్రామాలలో పేరుకుపోయిన ఇంటి పన్నుల వసూళ్లక కోసమే ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి గ్రామంలో గ్రామస్తులు సహకరించాలని టీం లీడర్ నిట్టు కిషన్ రావు అన్నారు. గురువారం డిచ్ పల్లి మండలం లోని బీబీ పూర్ తండా లో ఇంటింటికి తిరిగి పన్నులను వసూలు చేశారు. ఈ సందర్భంగా టీం లీడర్ నిట్టు కిషన్ రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో డబ్బులు ఉంటేనే గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఇదే కాకుండా వేసవి లో తాగు నీటికి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాస్థాయి, మండల స్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో పేరుకుపోయిన పనులను వసూలు చేయడానికి ప్రత్యేక టీం  లను ఏర్పాటు చేశారని వివరించారు.ముందుగా కేటాయించిన గ్రామాలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పన్ను వసూళ్లు చేయడం జరుగుతుందని, గ్రామాల్లో ప్రజలు కూడా టీం కు సహకరించి పన్నులను చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ముల్తాన్ బి, శిల్ప, స్టీఫెన్, శ్రావణి ,జాయశ్రీ,శ్రావంతి తోపాటు కరోబార్ తదితరులు పాల్గొన్నారు.