వినోదమే కాదు ఎమోషనూ ఉంది

Fun
No
Emotion too
There isనవీన్‌ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా రూపొందిన రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై మహేష్‌ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. శ్రీకష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా సెప్టెంబర్‌ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌ ఐమ్యాక్స్‌ మల్టీప్లెక్స్‌లో రిలీజ్‌ చేశారు. ఆడియెన్స్‌ నుంచి నుంచి సుబ్బు, చరణ్‌, తులసి, శతి, మీడియా ఫ్రెండ్స్‌ నుంచి ఐడియల్‌ బ్రెయిన్‌ జీవి చేతుల మీదుగా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పి.మహేశ్‌ బాబు మాట్లాడుతూ, ‘ట్రైలర్‌లో మేము కొంతే ఎంటర్‌టైన్‌ చేయగలిగాం. రేపు థియేటర్‌లో పూర్తి సినిమా చూస్తున్నప్పుడు కంప్లీట్‌గా ఎంజారు చేస్తారు. ఇదొక ఎంటర్‌ టైనింగ్‌ మూవీ మాత్రమే కాదు. ఒక ఎమోషన్‌ ఉంటుంది. ఇవాళ్టి యూత్‌.. రిలేషన్స్‌ను చూస్తున్న దష్టి కోణం ఉంటుంది. పెళ్లి ఒక్కటే కాదు వాళ్లు ఏర్పర్చుకునే ప్రతి రిలేషన్‌లో యువత ఆలోచించే తీరు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాం. ట్రైలర్‌లో మీరు చూసిన పాయింట్‌తోనే సినిమా ఉండదు. మిమ్మల్ని ట్రైలర్‌తో మిస్‌ గైడ్‌ చేస్తున్నాం. సినిమాలో మరో యూనిక్‌ పాయింట్‌ ఉంటుంది. అదేంటో సినిమాలో చూడాలి’ అని అన్నారు.’స్టాండప్‌ కామెడీ క్యారెక్టర్‌తో ఫుల్‌ లెంగ్త్‌ సినిమా తెలుగులో రాలేదు. అనుష్కతో నా కాంబినేషన్‌ బాగుంది’ అని హీరో నవీన్‌ పోలిశెట్టి చెప్పారు.