రక్తదానానికి మించింది మరొకటి లేదు

– రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ ఆంజనేయులు 
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి గ్రామంలో పబ్జిలిక్ పవర్ యూత్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం రక్త దాన శిబిరం నిర్వహించారు. యువకులు భారీ ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ ఆంజనేయులు, యూత్ అధ్యక్షులు బి విజయ్  మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి ఆ సమయంలో ఒక రక్తం చుక్క కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అన్ని దానాల కంటే రక్తదానం మహా గొప్పదని వారన్నారు. ఈ రక్తదానం కంటే మరొక దానం మించింది ఎమీ లేదన్నారు. ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. గ్రామ యువకులు ముందుకు వచ్చి శిబిరం ఏర్పాటు చేయించ0డం అభినందనమన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పులి సాగర్,రెడ్ క్రాస్ సొసైటీ ట్రైజరర్ కర్పె రవిందర్,అమర్ బాబు,గంగాధర్, యూత్ సభ్యులు బి గంగాధర్, కే సుమన్, గంగారాం, ప్రశాంత్, నర్సాగౌడ్, చంద్రకాంత్, శేఖర్, సందీప్, రజనీకాంత్ తో పాటు యూత్ సంఘ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.