
నవతెలంగాణ – డిచ్ పల్లి
తనవంతుగా నీరు పేదకు పెళ్లి కోసం పదివేల రూపాయలు, అర క్వింటాళ్ల బియ్యాన్ని శనివారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన ఒక ముస్లిం కుటుంబానికి అందజేసి తన ఉదారతను చాటుకున్నారు ధర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ ఇమ్మడి గోపి ముదిరాజ్. తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన ఒక నీరుపేద ఈ నేలా 26న జరిగే పెళ్లి కోసం తనవంతు సహాయంగా నిలవడానికి పది వేల రూపాయల నగదు,అర క్వింటాళ్ల బియ్యాన్ని అందజేసి ఉదరతను చాటుకున్నారు. పెళ్ళి విషయమై గ్రామానికి చెందిన పలువురు ఇమ్మడి గోపి ముదిరాజ్ దృష్టికి తీసుకొని వచ్చారు. వేంటనే స్పందించి మానవత దృక్పథంతో అర్థిక సహాయం బియ్యం అందజేయడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, ముస్లిం కమిటీ సభ్యులు,కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంటెకర్ సయ్యాజి, చాంద్ పాషా, షెక్ బాషు, మస్జిద్ కమిటీ అధ్యక్షులు అహ్మద్,అబ్దుల్ గఫర్,కుర్మ మల్లెష్, గొపిరెడ్డి శ్రీనివాస్,అబ్దుల్ అజిజ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.