ఆ మ్యాజిక్‌ ఉంది..

That magic is there..సుధీర్‌ బాబు, హర్షవర్ధన్‌ దర్శకత్వంలో రూపొందిన యూనిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మామా మశ్చీంద్ర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌ రావు తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్‌, సష్టి సమర్పిస్తున్నారు. ఈనెల 6న సినిమా విడుదలౌతున్న నేపథ్యంలో మేకర్స్‌ ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు.
హీరోలు శర్వానంద్‌, విశ్వక్‌ సేన్‌, శ్రీవిష్ణు, డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. హీరో సుధీర్‌ బాబు మాట్లాడుతూ,’ మంచి సినిమా చేశాం. ఈ సందర్భంగా నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన్ని మిస్‌ అవుతున్నాం. ఆయనకి ఈ సినిమా అకింతం చేయొచ్చని అనుకుంటున్నాం. ఇందులో చాలా సర్ప్రైజ్‌లు ఉంటాయి. ప్రతి పది నిమిషాలకు ఒక మలుపు వస్తుంది. కథ యూనిక్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఒత్తిళ్ళు వుంటాయి. ఈ సినిమా చూస్తున్నపుడు ఆ ఒత్తిళ్ళు అన్నీ మరిచిపోతారు’ అని తెలిపారు. ‘ప్రేక్షకులు ఉన్నారనే ధైర్యంతో ఈ సినిమా చేశాను. ఇందులో అన్ని ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ‘గుండెజారే, మనం..’ లాంటి మ్యాజిక్‌ ఉన్న కథ ఇదిఅని దర్శకుడు హర్షవర్ధన్‌ చెప్పారు.