నిబంధనలు ఉన్న .. నిఘా సున్నా

– ఎలక్షన్ వాల్ రైటింగ్ చేరిపి వేయని అధికారులు
– ఎలక్షన్ కమిషన్ నిబంధనలు గాలికి
నవతెలంగాణ -చందుర్తి
ఎలక్షన్ కోడ్ వచ్చి పదిహేను రోజులు గడిసిన అభ్యర్ధుల వాల్ పెయింటింగ్ మాత్రం అట్లనే ఉన్నాయి.మండలంలోని పలు గ్రామాల లో రోడ్ల కల్వర్టుల వద్ద ఎలాంటి రైటింగ్ ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు గోడ రాతలు అట్లానే ఉన్నాయి.కొన్ని గ్రామాల్లో కార్య దర్శులు నామ మాత్రంగా చేరిపి వేశారు,ఇక ప్రధాన రహదారి ఐన వేములవాడ,కోరుట్ల రోడ్ పక్కన కల్వర్టుల గోడల పై పెద్ద సైజ్ లో రాసిన వాల్ రైటింగ్ లు మాత్రం ఇప్పటి కి అధికారులు వాటిపై దృష్టి పెట్టక పోవడం శోచనీయం ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్న నిఘాసున్నా అన్నట్లుగా ఉంది.