బ్రస్సెల్స్ : బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ప్రజా సదస్సు (పీపుల్స్ సమ్మిట్) మంగళవారం ముగిసింది. లాటిన్ అమెరికా, యూరప్‌లకు చెందిన సామాజిక ఉద్యమాలు, ప్రగతిశీల శక్తులు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఒకపక్క సెలాక్, ఇయు దేశాల ప్రభుత్వాధినేతల మూడవ సమావేశం జరుగుతున్న సమయంలోనే మరోపక్క ఈ సామాజిక సదస్సు కూడా జరిగింది. సదస్సు చివరి రోజైన మంగళవారం జరిగిన చర్చలకు బ్రస్సెల్స్‌కి చెందిన ఫ్రీ యూనివర్శిటీ ఆతిధ్యమిచ్చింది. కొత్త కొత్త రూపాల్లో తలెత్తుతున్న యుద్ధం, నిరసన తెలిపే హక్కులపై చర్చలు జరిగాయి. ముగింపు సమావేశంలో తుది డిక్లరేషన్‌ను చదివి వినిపించారు.