– అని విద్యాసంస్థలు బంద్ ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ – ఉప్పునుంతల: ఉప్పునుంతల మండలంలోని అన్ని గ్రామాలలో పాఠశాలలను బంద్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎస్ఎఫ్ఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చింతల నాగరాజు మాట్లాడుతూ.. నీట్ మెడికల్ విద్యార్థులకు నిర్వహించే ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవకలను నిరశిస్తూ, జాతీయ పరీక్షల సమగ్రతను కాపాడాలని, కేంద్ర, రాష్ట్ర విద్యా సంస్థల లో సమస్యలు పరిష్కరించాలని బంద్ నిర్వహించడం జరిగింది అని అన్నారు. ఎన్టీ ఏ ను రద్దు చేయాలి. దేశంలో పాఠశాలల మూసివేతను విరమించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పునుంతల మండల ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు కె.శ్రీనివాస్, జె.శివకృష్ణ, గణేష్, విద్యార్థులు పాల్గొన్నారు.