– ఎన్‌పీఆర్‌డీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి, నిజానిజాలను బయటకు తీయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య, కోశాధికారి ఆర్ వెంకటేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కార్పొరేషన్‌లో జరుగుతున్న పరిణామలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి జరిగితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.