– తాండూరు జూనియర్ సివిల్ జడ్జీ శివలీల
– జిల్లా ఆస్పత్రిలో పండ్ల పంపిణీ
– ఆస్పత్రిలో వార్డులు తిరిగి సమస్యలు తెలుసుకున్న జడ్జి
నవతెలంగాణ-తాండూరు
క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని తాండూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శివలీల అన్నారు. శనివారం మండల న్యాయాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తాండూరులోని జిల్లా ప్రభు త్వాస్పత్రిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ..క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. క్యాన్సర్ నియంత్రణకు వైద్యులు చొరవ చూపాలన్నారు. ఆస్పత్రి సూపరింటెం డెంట్ డా.కేవీఎన్ మూర్తి మాట్లాడుతూ..క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ప్రాథమిక స్థాయిలో గుర్తించి వ్యాధిని నయం చేయొచ్చన్నారు. ఈ సందర్భంగా పలు వార్డులను తనిఖీ చేస్తూ రోగులకు ఎలాంటి వైద్యసేవలు అందుతున్నాయని అడిగి తెలుసుకుని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్య క్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మఠం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్, ఉపా ధ్యక్షులు నర్సప్ప, కార్యదర్శి రజిత, సీనీయర్ న్యాయ వాదులు బాలి శివకుమార్, పి.శ్రీనివాస్, అసోయేషన్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.