బాధ్యతలు, హక్కులపై అవగాహన ఉండాలి

– ఎస్సై శ్రీధర్‌ రెడ్డి, సర్పంచ్‌ శ్రీనివాస్‌
నవతెలంగాణ-మర్పల్లి
ప్రజలందరూ తమ బాధ్యతలు హక్కులపై తప్పనిసరిగా అవగాహ న ఉండాలని ఎస్సై శ్రీధర్‌ రెడ్డి, సర్పంచ్‌ శ్రీనివాస్‌లు అన్నారు. పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మండలంలోని బిల్కల్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ..ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతల పై అవగాహన అవసరమ న్నారు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో మరొకరు జోక్యం కల్పించుకోరా దని ఇతరుల మనోభావాలకు భంగం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. బాల్యవివాహాలు జరిపించిన, మహిళల పట్ల అసభ్యక రంగా ప్రవర్తించిన, బాల కార్మికులను పనిలో పెట్టుకున్న, దానికి బాధ్యు లైన వారిపై చట్ట ప్రకారం జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుంద న్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ మాధవరెడ్డి, వార్డెన్‌ తుల్జరామ్‌గౌడ్‌, కార్య దర్శి రామచందర్‌, వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.