త్యాగాలు చేసిన వ్యక్తుల పుస్తకాలు రావాలి

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
– సమాజం నుంచే ఆలోచనలు : కె.శ్రీనివాస్‌రెడ్డి
– మగ్దూం భవన్‌లో అసెంబ్లీలో ఒకే ఒక్కడు పుస్తకావిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కమ్యూనిస్టు యోధులపైనా, త్యాగాలు చేసిన వ్యక్తులపైనా చరిత్ర పుస్తకాలు రావాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నొక్కి చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో జర్నలిస్టు హసీనా రచించిన ‘అసెంబ్లీలో ఒకే ఒక్కడు’ పుస్తకాన్ని ఐజేయూ జాతీయ అధ్యక్షులు, ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్క రించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లా డుతూ.. పుస్తకాలు రాసే క్రమంలో కంటెంట్‌, అంశాల వారీగా ప్రాధాన్యత పాటిం చాలని సూచిం చారు. పుస్తకాన్ని రచించినదుకు షేక్‌ హసీనాను ఆయన అభినందించారు. కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లా డుతూ..దేశానికి కమ్యూనిస్టుల అవసరం చాలా ఉన్నదన్నారు. బీజేపీ వాళ్లు మాత్రం తమకు ప్రధమ శత్రువు కమ్యూనిస్టులే అని చెబుతున్నారన్నారు. ఆ పార్టీ తన సిద్ధాంత భావజాలంతో ముందుకెళ్లడం లేదని ప్రధాని మోడీపై సొంతపార్టీ నేతలే విమ ర్శలు ఎక్కుపెడుతున్నారన్నారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఎవ్వరు వెళ్లినా ప్రజలు పట్టించు కోవడం లేదనీ, వారిని యాక్సెప్ట్‌ చేస్తున్నారని తెలిపారు. కమ్యూనిస్టులు మారితేనే ఇబ్బందులు వస్తాయని అందరికీ అనిపిస్తోం దన్నారు. ఒక వ్యక్తి గురించి పుస్తకాన్ని రాసే సమయంలో రచయితకు స్వేచ్ఛ ఉంటుందనీ, అదే సమయంలో ఆ వ్యక్తికి సంబం ధించి తప్పులు దొర్లితే వాటిని సవరించే హక్కు కూడా ఆ వ్యక్తికి ఉంటుందని వివరించారు. కవి, రచయితలకు, మనిషికి సమాజం నుండే ఆలోచనలు వస్తాయని చెప్పారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజల గొంతుకే కమ్యూనిస్టుల గొంతు అని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందనీ, చట్టస భల్లో ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నప్పటికీ అందరి సమస్యలపైనా మాట్లాడాల్సిన అవసరం ఉంటుం దన్నారు. అందులో కూనంనేని సాంబశివరావు సఫలీకృతం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. సీఆర్‌ ఫౌండేషన్‌ మహిళా సంక్షేమ కేంద్రం డైరక్టర్‌ డి.కృష్ణకుమారి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం నుంచి ఇప్పటి వరకు చరిత్ర మరుగు నపడిన మహిళల చరిత్రను ‘రెడ్‌ స్వాన్‌ పబ్లిషర్స్‌ వేదిక’ ద్వారా ప్రతి మూడు నెలలకు ఒక పుస్తకాన్ని తీసుకొస్తామని తెలిపారు. పుస్తక రచయిత హసీనా మాట్లాడుతూ జీవితాలను త్యాగం చేసి, నిత్యం ప్రజల పక్షాన నిలడుతున్న పార్టీ సీపీఐ అని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ ప్రేంపావని, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.