గ్రామాల్లో రాజకీయ కక్షలు, గొడవలు ఉండవద్దు: ఎమ్మెల్యే

నవతెలంగాణ – మాక్లూర్
గ్రామాల్లో ప్రజలు రాజకీయ కక్షలు, గొడవలు పెట్టుకోవద్దని, ఎన్నికల ముందే రాజకీయం తరువాత అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలని ఆర్మూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం మందలంకెండ్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, సాదిముబరక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన పాల్గొని మాట్లాడారు. నేను రాజకీయాలకు కొత్త అని అన్నారు. స్థానిక ప్రజలు బిక్కు బిక్కు మంటు భయంతో జీవిస్తున్నారని, జిల్లా జెడ్పీ చైర్మన్ సైతం స్వంత గ్రామానికి వెళ్లి పరిస్థితి లేదని ఇలాంటి పరిస్థితి నేటి సమాజంలో నడుస్తుందని అవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి ఎవ్వరికీ బయపడవద్దని, ఎవ్వరికీ నచ్చిన పార్టీలో వాళ్ళు వెల్లేవచని సూచించారు. వారం రోజుల్లో 25 నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభించి, మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఒకే రోజు ప్రారంభిస్తామని తెలిపారు. దళిత బందు పథకంలో ధనిక దలితునికి కాకుండా బీద దలితునికి అందేలా చూడాలని అధికారులకు, నాయకులకు సూచించారు. డబుల్ బెడ్ రూం ఇల్లు పథకంలో ఇల్లు లేనివారికే అందిస్తామని అన్నారు. ముందుగా మాదాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ డీ. విఠల్ రావు, ఎంపిపి ప్రభాకర్, కార్పొరేటర్ రాయ్ సింగ్, తహశీల్దార్ షబ్బీర్, ఎంపీడీఓ క్రాంతి, అర్ ఐ షఫీ, మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు