నవతెలంగాణ – అశ్వారావుపేట
పాఠశాలల్లో స్కావెంజర్లు, కనీసం ఊడ్చే వాళ్ళు సైతం లేకపోవడంతో పారిశుధ్యం ప్రశ్నార్ధకంగా మారింది.దీంతో ఉపాధ్యాయులే పారిశుధ్యం కార్మికుల అవతారం ఎత్తు తున్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలం లోని గుర్రాల చెరువు మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలలో శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడే స్వయంగా మంచినీటి ట్యాంక్ ను శుభ్రం చేస్తున్న వైనం ఇది. ఉపాధ్యాయులు కు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడం మే కాదు ప్రస్తుతం పాఠశాల ప్రాంగణం శుభ్రం గా ఉంచడంతో పాటు ఆ పాఠశాల లోని మరుగుదొడ్లు,వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడం వారి విధుల్లో చేరాయి. ఉపాధ్యాయుడు బుధవారం స్కూల్ లోని వాటర్ ట్యాంకు శుభ్రంగా లేకపోవడంతో పంచాయతీ సిబ్బందికి తెలిపాడు.వారు వాటర్ ట్యాంకు లో దిగి మేము శుభ్రం చేయలేము అని చెప్పటంతో స్కూల్ పిల్లలతో ఆ పని చేయించడం భావ్యం కాదని స్వయంగా తానే శుభ్రం చేసారు. పాఠశాలను శుభ్రం చేసే స్కావెంజర్ లను ( పాఠశాలను శుభ్రం చేసే వ్యక్తి ) గత ప్రభుత్వం తీసివేయడం తో పాఠశాల శుభ్రం చేయడం చాలా కష్టంగా మారిందని ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ లకు అప్పగించారని కొన్ని గ్రామపంచాయతీ లోని సిబ్బంది పాఠశాలను శుభ్రం చేస్తున్నారని కొన్ని పంచాయతీల్లో సిబ్బంది పాఠశాలను శుభ్రం చేయట్లేదని ఇలా చేయటం వల్ల పాఠశాలలు అపరిశుభ్రంగా ఉంటున్నాయని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించి తిరిగి స్కావెంజర్ లను నియమించాలని కోరారు.