ఇలాంటి క్లైమాక్స్‌ రాలేదు

Such a climax did not comeహర్ష గంగవరపు, లతా విశ్వనాథ్‌, ఇనయ సుల్తాన ప్రధాన పాత్రల్లో ఏకైవ హోమ్స్‌ ప్రై.లి. బ్యానర్‌ మీద సూర్యదేవర రవీంద్రనాథ్‌ (చిన్న బాబు), రమేష్‌ బాబు కోయ నిర్మించిన చిత్రం ‘మదం’. వంశీ కృష్ణ మల్లా దర్శకుడు. ఈ చిత్రాన్ని మార్చి 14న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన టీజర్‌ను తండేల్‌ సినిమాతో పాటుగా థియేటర్లలో యాడ్‌ చేశారు. ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తున్న సందర్భంగా చిత్రయూనిట్‌ మీడియాతో సమావేశమైంది. డైరెక్టర్‌ వంశీకృష్ణ మల్లా మాట్లాడుతూ, ‘మా నిర్మాత రమేష్‌ ఇచ్చిన కథని చూసినప్పుడు నాకు చాలా భయమేసింది. ఇంతటి రా, రస్టిక్‌ సినిమా తెలుగులో రావడం అరుదు. తమిళం, మలయాళ భాషల్లో ఇలాంటి కంటెంట్‌ వస్తుంటుందిళీ కథ నాకు చాలా నచ్చింది. ఇలాంటి క్లైమాక్స్‌ ఇప్పటి వరకు ఇండియన్‌ సినీ హిస్టరీలో రాలేదు. ఈ మూవీని చూడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి’ అని అన్నారు. ‘నా కథను ఇంత అద్భుతంగా తీసిన వంశీకృష్ణకు థ్యాంక్స్‌’ అని రైటర్‌ రమేష్‌ బాబు కోయ చెప్పారు. ఇనయ సుల్తానా మాట్లాడుతూ, ‘నాకు నెగెటీివ్‌ పాత్రలు చేయడమంటే ఇష్టం. ఈ చిత్రంలో నేను చాలా ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ చేశాను. సినిమా అద్భుతంగా వచ్చింది’ అని తెలిపారు. ‘ఈ సినిమాకు కథే హీరో. ఇందులో హై ఎమోషన్స్‌ ఉంటాయి. అన్ని కారెక్టర్స్‌ బాగుంటాయి. నటించే స్కోప్‌ అందరికీ దొరికింది. మా రమేష్‌ కథ, వంశీ మేకింగ్‌ అద్భుతంగా ఉంటుంది. అందరికీ మా సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని హర్ష గంగవరపు అన్నారు. లతా విశ్వనాథ్‌ మాట్లాడుతూ, ‘నా నిజ జీవితంలో దగ్గరగా ఉండే పాత్రను పోషించాను’ అని చెప్పారు.