– ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్
నవతెలంగాణ-నూతనకల్
68 సంవత్సరాలగా గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమని తాను 9 సంవత్సరాల లో చేసిన అభివద్ధిని చూసి ఆశీర్వదించి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తుంగతుర్తి బీఆర్‌ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ అన్నారు బుధవారం మండల పరిధిలోని బక్క హెమ్ల , తండా, టేక్య తండా, సొమ్లా తండా, తాళ్ల సింగారం ఎడవెల్లి వెంకేపల్లి, చిల్పకుంట్ల ఎర్రపహాడ్, గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ గత పాలకుల కాలంలో నియోజకవర్గం సాగునీరు లేక మారిందని తాను శాసనసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత గోదావరి జలాలతో గ్రామంలోని అన్ని చెరువుల కుంటలు నింపి లక్షల ఎకరాలకు నీటిని అందించానని తెలిపారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికలలో వాగ్దానం చేసిన పథకాలనే కాకుండా వాగ్దానం చేయని పథకాలను కూడా అమలు చేసిన ఘనత దేశంలో కేసీఆర్‌కే దక్కిందనానరు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు రైతు బీమా, రుణమాఫీ ,దళిత బంధు గహలక్ష్మి బిసి బంధు ,కులాల అభివద్ధి కోసం యాదవులకు గొర్రెల పంపిణీ రజక నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ సరఫరా వంటి అనేక అభివద్ధి సంక్షేమ పథకాలను అమలుచేసి రాష్ట్ర ప్రజల సమగ్ర అభివద్ధి కోసం నిరంతరం కషి చేస్తున్నామని అన్నారు గతంలో నియోజకవర్గ కక్షలు రక్తపాతంతో ఉన్న ఈ ప్రాంతం సమగ్రంగా అన్ని రంగాలలో అభివద్ధి చెందిందన్నారు. అభివద్ధిని చూసి ఆశీర్వదించి మూడోసారి గెలిపించి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను చేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలందరికీ ఉందని గుర్తు చేశారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి జెడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కనకటి వెంకన్న వైస్ ఎంపీపీ జక్కి పరమేష్ బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య , మండల ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిలు గౌడ్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చూడు లింగారెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు కొంపెల్లి రామ్ రెడ్డి, కొచ్చర్ల బాబు ,పాతులోతు రంగమ్మ, గుగులోతు శంకర్ నాయక్, మాతంగి సోమలక్ష్మి ఎల్లయ్య ఎంపీటీసీలు గాడిదల రజితలింగరాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాజుల తిరుమల రావు గ్రంథాలయ మండల చైర్మన్ మట్టపల్లి గంగయ్య, బి అర్ ఎస్ నాయకులు పన్నాల సైదిరెడ్డి బిక్కి బుచ్చయ్య గౌడ్, ఆయా గ్రామ శాఖల అధ్యక్షులు కార్యదర్శులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.