
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రం నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి పదిన్నర గంటల మధ్య అలాగే మబ్బున 5 గంటల నుండి ఉదయం 8 గంటల లోపు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందని, ప్రయాణికులు ఎక్కువ బస్సు సర్వీసులు తక్కువ సమయపాలన లేని బస్సు సర్వీసులు అనే శీర్షికతో నవతెలంగాణ గత నాలుగైదు రోజుల క్రితం ప్రచురించిన శీర్షికకు బాన్సువాడ డిపో ఆర్టీసీ శాఖ అధికారులు బస్సు సర్వీసుల సమయపాలనలో మార్పులు చేర్పులు చేసినట్లు కనిపిస్తుంది. ఉదయం 9 గంటల నుండి పదిన్నర గంటల మధ్య బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. దీనితో ప్రయాణికులకు దూరప్రాంతాలకు వెళ్లడానికి బస్సు సర్వీసులు కొనసాగుతున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మబ్బున 5 గంటల నుండి ఉదయం 8 గంటల మధ్య బస్సు సర్వీసులు లేకపోవడం ఉదయం ఆరు గంటలకు ఏడు గంటలకు ఎక్కడికైనా వెళ్లాలంటే ఉదయం ఎనిమిది గంటల తర్వాతనే బస్సు సర్వీసులు ఉన్నట్లు ఆ మధ్యలో మూడు గంటలు అసలే బస్సు సర్వీసులు లేక ప్రయాణికులకు బస్సు సౌకర్యాలు కరువుగానే ఉన్నాయని, ఈ సమయంలో కూడా బస్ సర్వీసులు నడిపితే ఇటు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి అటు కామారెడ్డి జిల్లా కేంద్రానికి సౌకర్యంగా ఉంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.