న్యూఢిల్లీ : ప్రముఖ వాణిజ్య వాహనాల కంపెనీ డైమ్లర్ ఇండియా విద్యుత్ రంగ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. రవాణా పరిష్కారాలను డీకార్బనైజ్ చేయడానికి దీర్ఘకాలిక సంసిద్ధత కోసం వ్యూహాలను సిద్దం చేశామని తెలిపింది. ఆల్-ఎలక్ట్రిక్, నెక్స్ట్-జనరేషన్ ‘ఇ-క్యాంటర్’ తో బ్యాటరీ ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి ప్రవేస్తున్నట్లు వెల్లడించింది. రాబోయే 6 నుండి 12 నెలల్లో భారతదేశ మార్కెట్ లోకి ‘ఇ-క్యాంటర్’ను విడుదల చేయనున్నట్లు డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ సత్యకాం ఆర్య తెలిపారు.