– నాలుగేళ్లలో రూ.2వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం
హైదరాబాద్ : విద్యుత్ ద్విచక్ర వాహన కంపెనీ ప్యూర్ ఇవి 2025లో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు రావడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నాట్కో ఫార్మా ఫ్యామిలీ ఆఫీస్, లారస్ ల్యాబ్స్ ఫ్యామిలీ ఆఫీస్, హెచ్‌టి వెంచర్స్, బిసిసిఎల్, ఐఐటి హైదరాబాద్ తదితర ప్రముఖ పెట్టుబడిదారుల మద్దతుతో కంపెనీ బలమైన పెట్టుబడిదారుల నమ్మకాన్ని కలిగి ఉందని పేర్కొంది. గత మూడేళ్లుగా నిర్వహణ లాభాలను సాధించిందని తెలిపింది. రాబోయే నాలుగేళ్లల్లో రూ.2000 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్యూర్ ఇవి సిఇఒ రోహిత్ వదేరా తెలిపారు.